ఇంతకీ కేఎల్ రాహుల్ ను.. లక్నో ఓనర్ గోయంక ఏమన్నాడో తెలుసా?

praveen
ప్రస్తుతం ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా ప్రతి మ్యాచ్ కూడా ఉత్కంఠ భరితంగా సాగుతూ ఉంది అన్న విషయం తెలిసిందే. ఐపీఎల్ పోరు ప్లే ఆఫ్ దశకు చేరుకున్న నేపథ్యంలో అన్ని జట్లు కూడా ప్లే ఆఫ్ లో అడుగు పెట్టడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాయ్. ఇక ప్రతి మ్యాచ్ లో కూడా అద్భుతం ప్రతిభ కనబరుస్తున్నాయి అని చెప్పాలి  ఈ క్రమంలోనే కొన్ని టీమ్స్ ఇప్పటికే అటు టోర్ని నుంచి నిష్క్రమించగా మరికొన్ని టీమ్స్ కూడా ఇలా ఈ ఐపిఎల్ సీజన్ నుంచి వైదొలగడానికి రెడీగా ఉన్నాయి. అయితే ఇలా ఐపీఎల్లోని ప్రతి మ్యాచ్ కూడా ఉత్కంఠ భరీతంగా సాగుతూ ఉండగా.. ఇటీవల సన్రైజర్స్ హైదరాబాద్, లక్నో జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది.

 ప్రస్తుతం అందరూ కూడా ఇదే విషయం గురించి చర్చించుకుంటూ ఉండటం గమనార్హం. ఈ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేసిన లక్నో అతి తక్కువ పరుగులకే పరిమితమైంది. దీంతో ఇక ఆ తర్వాత చేదనలో సన్రైజర్స్ ఓపెనర్లు విధ్వంసం సృష్టించారు. ఇక ఒక వికెట్ కూడా కోల్పోకుండా సన్రైజర్స్ కేవలం 9 ఓవర్లలోనే టార్గెట్ చేధించింది. దీంతో కోపంతో ఊగిపోయిన లక్నో ఓనర్ గోయాంక ఆ జట్టు కెప్టెన్ కే ఎల్ రాహుల్ పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించాడు అన్న విషయం తెలిసిందే. ఏకంగా డగ్ అవుట్ లో రాహుల్ మొహం మీద దారుణంగా తిట్టేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో కాస్త వైరల్ గా మారిపోయింది.

 దీంతో ఒక జట్టుకు కెప్టెన్ గా ఉన్న ఆటగాడిని ఇలా అందరి ముందు తిట్టడం ఏంటి అని అందరూ విమర్శలు చేస్తూ ఉన్నారు. ఇంతకీ గోయంక అటు కేఎల్ రాహుల్ తో ఏం మాట్లాడాడు అన్న విషయం కూడా హాట్ టాపిక్ గా మారింది. గోయాంక కేఎల్ రాహుల్ తో ఏమన్నారు అనే విషయంపై ఇండియన్ ఎక్స్ ప్రెస్ ఒక నివేదిక విడుదల చేసింది. సన్రైజర్స్ ఓపెనర్లు విలయతాండవం చేసిన అదే పిచ్ పై కేఎల్ రాహుల్ 33 బంతుల్లో 29 పరుగులు మాత్రమే చేశాడు. అదే సమయంలో లక్నో ఆటగాళ్లలో గెలవాలని కసి కనిపించకపోవడం.. అత్యంత పేలవమైన బౌలింగ్ ఈ అన్ని అంశాలపైతీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ కెప్టెన్ కేఎల్ రాహుల్ ని గోయంక నిలదీశారు అని తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: