కదిరి: 6,225 ఓట్ల మెజారిటీతో టిడిపి అభ్యర్థి హవా..!

Divya
1951 లో డీలిమిటేషన్ ఆర్డర్స్ ప్రకారం ఏర్పాటైన ఈ నియోజకవర్గం నుండి 2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి పెదబల్లి వెంకట సిద్ధారెడ్డి పోటీ చేసి భారీ విజయాన్ని సొంతం చేసుకున్నారు 2019 నాటికి ఈ కదిరి నియోజకవర్గంలో 239,867 మంది ఓటర్లు ఉండగా ఇప్పుడు ఆ ఓటర్ల సంఖ్య మరింత పెరిగిందని చెప్పాలి. ఇక అందులో భాగంగానే గత ఏడాది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో ఈసారి మళ్లీ అధికారంలోకి రావాలని.. వైసిపి పార్టీ అభ్యర్థి వెంకట సిద్ధారెడ్డి పోటీ చేయాలనుకున్నారు.. కానీ ఈసారి ఆయనను తప్పించి ఆయన స్థానంలో మక్బూల్ అహ్మద్ కు టికెట్ కేటాయించడం జరిగింది. దీంతో టికెట్టు ఆశించిన వెంకట సిద్ధారెడ్డి కొంతమేర భంగపడ్డారు అనే వార్తలు వినిపించాయి.

మరొకవైపు కూటమి తరపున టీడీపీ అభ్యర్థి కందికుంట వెంకటప్రసాద్ బరిలోకి దిగారు.. పోటాపోటీగా ఎవరికి వారు ప్రచారాలు నిర్వహించి అధికారంలోకి రావాలని ప్రయత్నాలు చేస్తున్నారు.. మరి ప్రజలు ఎవరి వైపు మొగ్గు చూపారు అనే విషయాన్ని తాజాగా వెళ్లడైన ఫలితాలు చూపెడుతున్నాయి.. మరి కదిరి నియోజకవర్గంలో అటు టిడిపి ఇటు వైసిపి ఎవరికి వారు అధికారంలోకి రావాలని ప్రయత్నం చేసిన విషయం తెలిసిందే. ఇక హోరా హోరీగా సాగిన ఈ పోరులో చివరిగా గెలిచింది ఎవరు అనే విషయానికి వస్తే..తాజాగా వెలువడిన కౌంటింగ్ ఫలితాలలో ఫైనల్ గా..6,225 ఓట్ల మెజారిటీతో టిడిపి అభ్యర్థి కందికుంట వెంకట ప్రసాద్  విజయం సాధించారు.. ఎవరు ఊహించని విధంగా కదిరిలో టిడిపి సైకిల్ స్పీడుగా దూసుకుపోతోందని చెప్పవచ్చు.  మొత్తానికైతే ఇక్కడ కూడా వైసిపి సీటు కోల్పోయింది. ఏది ఏమైనా వైసీపీకి ఇంత దారుణంగా సీట్లు పడిపోవడం నిజంగా ఒక రకంగా బాధాకరమని చెప్పవచ్చు మొత్తానికైతే టీడీపీ కూటమిలో భాగంగా 136 స్థానాల్లో ఆధిక్యత సాధించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: