పాలకొండలో జనసేన జోరు... కళావతి పై జయకృష్ణ భారీ విజయం..!

Pulgam Srinivas
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొన్ని రోజుల క్రితం జరిగిన ఎన్నికలకు సంబంధించిన ఫలితాలు ఈ రోజు విడుదల అవుతున్నాయి. ఈ రోజు ఉదయం 6 గంటలకు ఎలక్షన్ సంఘం ఆధ్వర్యంలో ఓట్ల లెక్కింపు కార్యక్రమం ప్రారంభం అయింది. అందులో భాగంగా మొదట ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగస్తులు పోస్టల్ బ్యాలెట్ పద్ధతి ద్వారా వేసిన ఓట్లను లెక్కించారు. అందులో భాగంగా ఏ నియోజకవర్గంలో ఏ పార్టీకి ఎన్ని పోస్టల్ బ్యాలెట్ ఓట్లు వచ్చాయి అనే దానిని ఎలక్షన్స్ సంఘం ఇప్పటికే అధికారికంగా ప్రకటించింది.

ఇక ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఓట్ల లెక్కింపు చాలా స్పీడ్ గా జరుగుతుంది. అందులో భాగంగా కొన్ని చిన్న నియోజకవర్గాలకు సంబంధించిన ఫలితాలు ఇప్పటికే వెలువడ్డాయి. ఇకపోతే తాజాగా ఒకప్పుడు ఉమ్మడి కృష్ణా జిల్లాలో నియోజకవర్గంగా ఉండి , ప్రస్తుతం పార్వతీపురం మన్యం జిల్లాలో నియోజకవర్గంగా ఉన్న పాలకొండ కి సంబంధించిన ఫలితం వెలువడింది.

ఇకపోతే ఈ ప్రాంతం నుండి వై సీ పీ పార్టీ అభ్యర్థిగా విశ్వసరాయి కళావతి బరిలో నిలవగా ... ఇక ఈ ప్రాంత సీటును తెలుగు దేశం , జనసేన , బి జె పి పొత్తులో భాగంగా జనసేన పార్టీ అభ్యర్థి అయినటువంటి నిమ్మక్క జయకృష్ణ కు దక్కింది. ఇక అధికార పార్టీ అభ్యర్థి కావడం , ఎలక్షన్లకి చాలా రోజుల ముందే ఈమెకు సీటు కన్ఫామ్ కావడంతో ఈమె ముందుగానే క్యాడర్ ను రెడీ చేసుకుని ప్రచారాలను చేసింది. ఇక జనసేన నుండి జయకృష్ణ కి కాస్త లేటుగా టికెట్ కన్ఫామ్ అయ్యింది.

అయినప్పటికీ ఈయనకు జనసేన అనుకూల ఓటు బ్యాంకు తో పాటు తెలుగు దేశం , బి జె పి అనుకూల ఓట్లు కూడా పడే అవకాశం ఉండడంతో వీరిద్దరి మధ్య గట్టి పోటీ ఉంటుంది అని జనాలు మొదటి నుండే భావించారు. ఇకపోతే తాజాగా పాలకొండ నియోజకవర్గానికి సంబంధించిన ఫలితం విడుదల అయింది. ఇక్కడ జనసేన పార్టీ అభ్యర్థి అయినటువంటి జయకృష్ణ నిమ్మక కి 75208 ఓట్లు రాగా , వైసిపి పార్టీ అభ్యర్థురాలు అయినటువంటి విశ్వసరాయి కళావతి కి 61917 ఓట్లు వచ్చాయి. దీనితో కళావతి పై జయకృష్ణ 13291 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: