అందరికీ మంచి చేయడమే నేను చేసిన తప్పా.. జగన్ ప్రశ్నలకు జవాబులున్నాయా?

Reddy P Rajasekhar
ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలోని పేద మధ్యతరగతి వర్గాల ప్రజలకు ప్రయోజనం చేకూరే విధంగా ఎన్నో పథకాలను ప్రకటించి ఆ హామీలను అమలు చేసినా ఎన్నికల్లో సానుకూల ఫలితాలు రాలేదు. ఎన్నికల ఫలితాలపై జగన్ స్పందిస్తూ ప్రజల తీర్పును శిరస్సా వహిస్తానని చెప్పారు. గతంలో మేనిఫెస్టోను చెత్తబుట్టలో వేసిన పరిస్థితులు చూశామని వాలంటీర్ల, సచివాలయ వ్యవస్థలను తీసుకొచ్చామని జగన్ అన్నారు.
 
వివక్ష లేకుండా ఇంటింటికీ సంక్షేమ పథకాలను అందించానని జగన్ తెలిపారు. ఓడిపోయినా ప్రతి కష్టంలో అండగా నిలబడిన వాళ్లకు సీఎం జగన్ ధన్యవాదాలు తెలిపారు. కోటీ 5 లక్షల మందికి సంక్షేమ అథకాలను అందించామని చెప్పిన సమయానికి రైతు భరోసా జగన్ అన్నారు. ఏం చేసినా ఎంత చేసినా 40 శాతం ఓటు బ్యాంక్ వైసీపీకి అలానే ఉందని సీఎం తెలిపారు. పడినా మళ్లీ లేచి గుండె ధైర్యంతో అడుగులు వేస్తామని జగన్ వెల్లడించారు.
 
ప్రతిపక్షంలో ఉండటం కొత్త కాదని నా రాజకీయ జీవితం అంతా ప్రతిపక్షంలో ఉన్నానని ఎన్నడూ చూడని కష్టాలను అనుభవించానని అంతకు మించి కష్టాలు వచ్చినా వాటిని అనుభవించడానికి సిద్ధమేనని జగన్ కామెంట్లు చేశారు. సార్వత్రిక ఎన్నికల ఫలితాల గురించి జగన్ చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి.
 
ఎన్నికల్లో గెలుపోటములు సహజమని తప్పులు తెలుసుకుని ముందడుగులు వేస్తే భవిష్యత్తులో జరిగే ఎన్నికల్లో వైసీపీ మరోసారి సత్తా చాటే ఛాన్స్ అయితే ఉంటుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఎంత గొప్పగా పాలించినా కొన్నిసార్లు చిన్నచిన్న తప్పుల వల్ల అధికారం కోల్పోవాల్సి ఉంటుందని అంత మాత్రాన బాధ పడాల్సిన అవసరం లేదని రాజకీయ విశ్లేషకులు జగన్ కుచెబుతున్నారు. అందరికీ మంచి చేయడమే నేను చేసిన తప్పా అంటూ జగన్ ప్రశ్నించారు. జగన్ కు దేవుడు మనో ధైర్యాన్ని ఇవ్వాలంటూ నెటిజన్లు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: