తిరుపతి ఎన్నికల్లో ఆధిక్యత ఈ పార్టీకే...?

VAMSI
ఏపీలో తిరుపతి పార్లమెంట్ స్థానానికి ఉప ఎన్నిక జరగబోతున్న విషయం తెలిసిందే. ఈ ఎన్నికను ఏపీలోని అన్ని రాజకీయ పార్టీలు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. దీనితో ఎన్నికల సమరం రసవత్తరంగా సాగనుంది. ఇప్పటికే ఆయా పార్టీలు గెలుపు ప్రధాన ధ్యేయంగా ప్రచారంలో పాల్గొన్నారు.. ఈ ప్రచార కార్యక్రమాల్లో ప్రత్యర్థి పార్టీలపై పలు రకాల విమర్శలను చేశారు. ఓవరాల్ గా చేసుకున్నట్లయితే అన్ని పార్టీలు అధికార వైసీపీ నే లక్ష్యంగా చేసుకుని ప్రచారాలు సాగించాయి. ముఖ్యంగా టీడీపీ వివేకానంద రెడ్డి హత్య విషయాన్ని హైలైట్ గా చూపించింది. మొత్తానికి ఈ ఎన్నికల ప్రచారం ముగిసింది. 

ఇక ఎన్నికల పోలింగు జరగడమే తరువాయి. ఈ సందర్భంలో ఏ పార్టీలకు ఎన్ని  ఓట్లు వస్తాయి అన్న విషయం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మాములుగా ఏ ఎన్నికలు వచ్చినా కొన్ని సర్వేలు జరుగుతూ ఉంటాయి. కొన్ని సమయాలలో ఎన్నికలలో పాల్గొనే పార్టీలే వారి టీం ల ద్వారా సర్వే చేయించుకుంటూ ఉంటారు. వైసీపీ వారి యొక్క డిజిటల్ టీం చేత చేయించుకున్న సర్వే ప్రకారం పార్టీల వారీగా ఓట్ల అంచనాలు ఈ విధంగా ఉన్నాయి. వైసీపీ వారికి దాదాపు 65 శాతం ఓట్లు దక్కనున్నాయని తెలుస్తోంది.  మరియు తెలుగుదేశం పార్టీకి 22 శాతం ఓట్లు వస్తాయని తెలిపింది. అంతే కాకుండా 15 నుండి 17 శాతం ఓట్ల వరకు జనసేన మరియు పార్టీకి వచ్చే అవకాశం ఉందని వైసీపీ చేసిన సర్వే చెప్పడం జరిగింది.

అంతే కాకుండా వారి పార్టీ వారు వేస్తున్న అంచనాల ప్రకారం 50 శాతం వరకు వైసీపీకి, 33 శాతం వారికి తెలుగుదేశం పార్టీకి మరియు 17 శాతం బీజేపీకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. టీడీపీ అంచనాల ప్రకారం వైసీపీ ఈ ఎన్నికలకి డబ్బులు పంచకపోతే 30, 000 ఓట్ల తేడాతో ఓటమి పాలవుతుంది. ఒకవేళ వైసీపీ డబ్బులు పంచినట్లయితే ఒక లక్ష నుండి రెండు లక్షలు ఓట్లు తేడా వస్తుంది. బీజేపీ అంచనాల ప్రకారం గతంలో కంటే ఎక్కువగానే ఓట్లు వస్తాయని అనుకుంటోంది. ఇదే పార్టీలోని మరొక వర్గం టీడీపీ కి సమానంగా ఓట్లస్ను సాధిస్తామని తెలిపింది. ఇవన్నీ కూడా కేవలం అంచనాలు మాత్రమే. ఓట్లు ఎవరికి వెయ్యాలో ప్రజలకు తెలుసు.. కాబట్టి  ఎవరు గెలుస్తారో చూద్దాం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: