పవన్‌ కల్యాణ్‌ను వెంటాడుతున్న పాచిపోయిన లడ్డూలు..?

Chakravarthi Kalyan
రాజకీయాల్లో డైలాగులు చాలా ప్రధానం.. మాటలు చాలా ప్రధానం.. అవి బుల్లెట్లలా దూసుకువెళ్తాయి. ఆ మాటలను ఈటెలుగా వాడితే శత్రువులను చీల్చి చెండాడుతాయి. అయితే అవే మాటలు ఒక్కోసారి ఆ మాటలు అన్నవారికే బూమరాంగ్ అవుతుంటాయి. అయితే అందుకు రాజకీయ వ్యూహంలో లోపం కారణంగా కావచ్చు.. ఇప్పుడు జనసేన అధినేత పవన్ కల్యాణ్ విషయంలో ఇదే జరుగుతోంది. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు.. పవన్ కల్యాణ్ ఇదే మోడీ సర్కారును తిట్టిపోశాడు.. బీజేపీ పాచిపోయిన లడ్డూలు చేతిలో పెట్టిందని విమర్శంచారు.  ఆ పాచిపోయిన లడ్డూల డైలాగ్ జనంలోకి బలంగా వెళ్లింది.

అయితే ఇంతలో 2021కు వచ్చేసరికి సీన్ పూర్తిగా మారిపోయింది. జనసేన ఆశలు గల్లంతయ్యాయి. చివరకు కేవలం ఒకే ఒక్క ఎమ్మెల్యే సీటు దక్కించుకుంది. చివరకు పవన్ కూడా ఓడిపోయారు. దీంతో పవన్ కల్యాణ్‌కు ఆ పాచిపోయిన లడ్డూలు ఇచ్చిన బీజేపీతోనే మళ్లీ దోస్తీకి సిద్ధమయ్యారు. అయితే ఇప్పుడు అదే పాచిపోయిన లడ్డూల డైలాగ్ జనసేనకు పీడకలగా మారుతోంది. వైసీపీ నేతలు పదే పదే దాన్ని గుర్తు చేస్తున్నారు. పాచిపోయిన లడ్డూలు ఇప్పుడు పవన్‌ కల్యాణ్‌కు రుచిగా ఉన్నాయా? అని వైసీపీ నాయకులు ప్రశ్నించారు. విభజన హమీలపై కేంద్రం మాటతప్పితే పవన్‌ ఇప్పుడేందుకు నోరు మూసుకున్నారని  మంత్రి అప్పలరాజు ఎద్దేవా చేశారు.

తిరుపతి ఎన్నికల ప్రచారంలో ఈ లడ్డూల డైలాగ్ ఇప్పుడు మారు మోగుతోంది.  తిరుపతి సభలో ప్రత్యేక హోదా అడిగిన పవన్‌కళ్యాణ్, బీజేపీని ఎందుకు నిలదీయడం లేదన్నారు. ఈ ఎన్నికలో బీజేపీని గెలిపిస్తే పోరాటం చేస్తామన్నారు. మరి అదే వేదిక మీద బీజేపీ పెద్దలను పవన్‌కళ్యాణ్‌  ఎందుకు అడగలేదు? రాష్ట్రానికి ఎందుకు అన్యాయం చేస్తున్నారు? హోదా ఎందుకు ఇవ్వలేదు? విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ను ఎందుకు అమ్మేస్తున్నారు? అని ఆ పార్టీ పెద్దలను నిలదీయలేదు. కానీ ప్రజలను మాత్రం రెచ్చగొడతారు.. అంటూ మంత్రి అప్పలరాజు ప్రశ్నించారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: