వర్షాలు వచ్చేలోగా పూర్తి చేయండి.. జగన్ కీలక ఆదేశాలు..?
అన్ని రకాల నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ పోలవరం ప్రాజెక్టును ఎంతో అద్భుతంగా నిర్మించాలని అటు ఇంజినీర్ లకు కూడా జగన్ ప్రభుత్వం సూచనలు సలహాలు ఇస్తూనే ఉంది. అయితే ఇటీవలే పోలవరం ప్రాజెక్టు విషయం పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు జగన్. వర్షాలు వచ్చే లోగా పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులు శరవేగంగా జరిపి ఇక పనులు మొత్తం పూర్తి చేయాలి అంటూ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు సీఎం జగన్ మోహన్ రెడ్డి. అయితే పోలవరం ప్రాజెక్టు లో శరవేగంగా జరగటానికి రానున్న నలభై ఐదు రోజులే ఎంతో కీలకంగా మారబోతున్నాయి అంటూ చెప్పుకొచ్చారు సీఎం జగన్.
కాపర్ డ్యాం లో కాళీ లతోపాటు అప్రోచ్ ఛానల్ పూర్తి చేయడంపై ముందుగా అధికారులు దృష్టి పెడితే శరవేగంగా పనులు పూర్తవుతాయి అంటూ జగన్ అభిప్రాయం వ్యక్తం చేశారు. నెల్లూరు బ్యారేజీ,సంఘం బ్యారేజి,అవుకు టన్నెల్ 2, వెలుగొండ వంశధార నాగావళి లింక్ పనులను ప్రాధాన్యత ప్రాజెక్టులుగా నిర్ధారించామని ఎలాంటి నిధుల సమస్య లేకుండా చూస్తాము అంటూ సీఎం జగన్ తెలిపారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం శరవేగంగా పూర్తి చేయడానికి ఎప్పటికప్పుడు సీఎం జగన్మోహన్ రెడ్డి ఇక నిధులను విడుదల చేస్తూనే ఉన్నారు. ఇక సీఎం జగన్ ఆదేశాలు జారీ చేయడంతో అధికారులు కూడా ఎంతో అప్రమత్తమై పోయి శరవేగంగా పనులు నిర్వహిస్తున్నారు.