బెంగాల్లో సీన్ మారుతుందా.. కొత్త సర్వే రిపోర్ట్ ఇదే..?

praveen
పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో మరికొన్ని రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ప్రస్తుతం బెంగాల్ రాజకీయ మొత్తం ఆసక్తికరంగా మాడిపోయింది.  అయితే ఎన్నో రోజుల నుంచి బెంగాల్ లో బీజేపీ పాగా వేయాలని ప్రయత్నిస్తున్నప్పటికీ బెంగాల్ ప్రజలు మాత్రం బీజేపీ వైపు అంతగా ఆసక్తి చూపలేదు. అయితే ఈ సారి మాత్రం అసెంబ్లీ ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో  పశ్చిమ బెంగాల్ లో పాగా వేయాలని ప్రయత్నిస్తోంది బిజెపి. ఈ క్రమంలోనే ఎన్నికల నోటిఫికేషన్ రాకముందు నుంచే ఎంతో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది అన్న విషయం తెలిసిందే.

 అయితే బిజెపి పెద్దలందరూ ప్రస్తుతం పశ్చిమ బెంగాల్లో రంగంలోకి దిగి ఇక బెంగాలీ ఓటర్లను ఆకట్టుకునేందుకు తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నారు  తమదైన శైలిలో ప్రసంగాలు ఇస్తూనే ఓటర్లను ఆకట్టుకునేందుకు ఎన్నో పాట్లు పడుతున్నారు. అయితే అటు అధికార తృణమూల్ కాంగ్రెస్ మాత్రం ఈసారి కూడా తమదే అధికారం అంటూ ధీమాతో ఉంది. అయితే సాధారణంగా అసెంబ్లీ ఎన్నికలు వచ్చాయి అంటే చాలు అటు ఎన్నో సర్వేలు వస్తూ ఉంటాయి. ఈ క్రమంలోనే కొన్ని రకాల సర్వేలలో ప్రస్తుతం పలు ఆసక్తికర విషయాలను వెల్లడయ్యాయి.

 పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఎంత ప్రయత్నించినప్పటికీ తృణమూల్ కాంగ్రెస్కు వచ్చే సీట్లు తగ్గించగలదు కానీ అధికారం మాత్రం చేజిక్కించుకోవడం కష్టమైన పని అని ప్రస్తుతం విశ్లేషకులు అంటున్నారు..  ఇక మరికొన్ని రోజులలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ దాదాపుగా 170 స్థానాల్లో విజయం సాధించి అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని అయితే గత ఏడాది కంటే  ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ మంచి మెజారిటీ స్థానాలు గెలుచుకునే అవకాశం ఉందంటున్నారు విశ్లేషకులు. గత ఎన్నికల కంటే ఈ ఎన్నికల్లో బీజేపీ ఓటింగ్ శాతం పెరిగే అవకాశం ఉంది అని చెబుతున్నారు. మరి ఏం జరుగుతుంది అన్నది ఎన్నికల తర్వాత తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: