మదనపల్లి జంట హత్యల కేసులో కీలక పరిణామం.. పోలీసులు షాక్..?

praveen
మదనపల్లి జంట హత్యల కేసు తెలుగు రాష్ట్రాల్లో ఎంత సంచలనం సృష్టించిందో ప్రత్యేకం గా చెప్పాల్సిన పని లేదు. ఎంతో విద్యా వంతులైన తల్లిదండ్రులు... ప్రస్తుతం ఉన్నత విద్య అభ్యసిస్తున్న కూతుర్లు.. మూఢనమ్మకాల ఊబిలో కూరుకు పోయి చివరికి  దారుణానికి పాల్పడ్డారు.  ఏకంగా సొంత కూతురు ని తల్లిదండ్రులు దారుణం గా హత్య చేసిన ఘటన ఒక్కసారిగా తెలుగు రాష్ట్రాలలో ప్రజలందరినీ ఉలికిపాటుకు గురిచేసింది.  అయితే మదనపల్లి జంట హత్య కేసులో ఇక ఇద్దరు కూతుళ్లను హత్య చేసినా తల్లి దండ్రులను అరెస్టు చేశారు పోలీసులు.


 అయితే ఎంతో ఉన్నత విద్యావంతులైన వారిద్దరిని అరెస్టు చేసి జైలులో ఉంచిన తర్వాత వారి విచిత్ర ప్రవర్తన చూసి అటు పోలీసులు ఒక్కసారిగా అవాక్కయ్యారు. ఏకంగా జైల్లోనే క్షుద్రపూజలు చేస్తున్నట్లు గా ప్రవర్తించడం గట్టిగా అరుస్తూ ఉండటం లాంటివి చేయడం వల్ల ఒకానొక సమయంలో పోలీసులు సైతం ఆందోళన చెందారు అని చెప్పాలి.  ఇక ఆ తర్వాత మానసిక నిపుణులు వారిని చూసి చికిత్స అందించారు. ఇక ఇటీవలే మదనపల్లె జంట హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది.



 మదనపల్లె జంట హత్య కేసులో అరెస్ట్ అయిన పురుషోత్తం, పద్మజ లు మొన్నటివరకు విశాఖ సెంట్రల్ జైలు లో ఉన్నారు. అయితే ఇటీవలే వారిని ప్రత్యేక వాహనంలో మదనపల్లె సబ్ జైలుకు తరలించారు.  మొన్నటి వరకు జైలులో ఉన్న  సమయంలో చిత్రవిచిత్రంగా ప్రవర్తించిన పద్మజా ఇక ఇటీవలే సెంట్రల్ జైలు నుంచి సబ్ జైలుకు తరలిస్తున్న సమయంలో ఎలాంటి హడావిడి చేయకుండా చిత్రంగా ప్రవర్తించకుండా .. సాధారణంగానే పోలీసు వ్యాన్ దిగి ఇక సబ్ జైలుకు వెళ్లి పోయింది. కూతుళ్లను చంపినందుకు ప్రస్తుతం పద్మజా పశ్చాత్తాపానికి గురవుతున్నట్లు తెలుస్తోంది.  అయితే పద్మజా అలా ఒక్కసారిగా నార్మల్గా మారిపోవడంతో అటు పోలీసులు సైతం అవాక్కయ్యారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: