వైరల్ వీడియో : ఒక్క క్షణం ఆలస్యమైనా ప్రాణం పోయేది..?
ఇక ఇలాంటి తరహా వీడియోలు సోషల్ మీడియా వేదిక లోకి వచ్చినప్పుడు ఇవి చూసిన నెటిజన్లు ఆశ్చర్య పోతూ ఉంటారు. కాగా ఇప్పుడు ఇలాంటి తరహా ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ఈ భూమ్మీద నూకలు తినే భాగ్యం ఉంటే ఎలాంటి ప్రమాదం వచ్చిన బ్రతికి బయట పడతారు అని చెబుతూ ఉంటారు పెద్దలు. కొన్ని కొన్ని రకాల సంఘటనలు చూస్తుంటే ఇది నిజమే అనిపించకమానదు. ఇటీవలే వైరల్ గా మారిన వీడియోని చూస్తే మీకు ఈ సామెత గుర్తుకు వస్తుంది. రెప్పపాటుకాలంలో చనిపోయే వ్యక్తిని మరో వ్యక్తి కాపాడగలిగాడు. క్షణం ఆలస్యం అయినా కూడా ఏకంగా ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోయేవాడు.
బిల్డింగ్ పై నుంచి పడిపోతున్న ఓ వ్యక్తిని క్షణాల్లో స్పందించిన పక్కనే ఉన్న వ్యక్తి పట్టుకొని ఇక ఆ వ్యక్తి ప్రాణాలను కాపాడిన ఘటన కేరళలో వెలుగులోకి వచ్చింది. బిను, బాబురాజ్ అనే ఇద్దరు వ్యక్తులు వడకరలోని బ్యాంకులో మనీ డిపాజిట్ చేసేందుకు వెళ్లారు. బ్యాంకులో కస్టమర్లు ఎక్కువగా ఉండడంతో ఇక అక్కడ బాల్కనీలో నిలబడ్డారు. ఈ క్రమంలోనే బిను అనే వ్యక్తి స్పృహతప్పి బాల్కనీ నుంచి కిందకి పడిపోతుండగా.. పక్కనే ఉన్న బాబు రాజ్ అనే వ్యక్తి వెంటనే అప్రమత్తమై క్షణాల వ్యవధిలో అతన్ని పట్టుకున్నాడు. ఇక ఆ తర్వాత స్థానికులు అందరూ వచ్చి సహాయం చేయడంతో కిందకి పడిపోతు ఉన్నా అతన్ని పైకి లాగారూ.దీంతో అతని ప్రాణాలను కాపాడ గలిగాడు. దీనికి సంబంధించిన విజువల్స్ అన్ని సిసిటివి ఫుటేజీలో రికార్డు కావడంతో ఈ వీడియో వైరల్ గా మారిపోయింది.