ఊహించని వ్యక్తులతో షర్మిల చర్చలు.. ఇదే ఇప్పుడు హాట్ టాపిక్..?
ఈ క్రమంలోనే అందరికీ కౌంటర్ ఇచ్చే విధంగా తాను తెలంగాణ కోడలిని అంటూ వైఎస్ షర్మిల చెప్పుకొచ్చారు అనే విషయం తెలిసిందే . ఇకపోతే వైయస్ షర్మిల పార్టీకి రోజురోజుకు బలం పెరిగిపోతున్నట్టు వుంది. ఇప్పటికే పలువురు ఇతర పార్టీల నేతలు షర్మిలతో మంథనాలు జరుపుతూ ఉండటం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారిపోయింది. ఇక ఇటీవలే టిపిసిసి కార్యనిర్వాహక అధ్యక్షుడు ఇండియా మాజీ క్రికెటర్ అజారుద్దీన్ కుమారుడు మహమ్మద్ అసదుద్దీన్ లోటస్పాండ్ షర్మిలను కలిసి పలు విషయాలపై చర్చించారు.
కేవలం అసదుద్దీన్ మాత్రమే కాదు ఆయన సతీమణి ఆనం మీర్జా కూడా వైయస్ షర్మిల ను కలవడం ఆసక్తికరంగా మారిపోయింది అయితే ఆ ఆనం మీర్జా తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ సానియా మీర్జా సోదరి అనే విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం క్రీడా రంగాల్లో ప్రముఖులైన అజారుద్దీన్, సానియా మీర్జా ల కుటుంబాల నుంచి కొత్తగా పార్టీ పెట్టెందుకు సిద్ధమవుతున్న వైయస్ షర్మిలను కలవడం ఆసక్తికరంగా మారి పోయింది. తాము కేవలం మర్యాదపూర్వకం గానే వైయస్ షర్మిల ను కలిసినట్లు చెప్పినప్పటికీ వీరి సమావేశం వెనుక అసలు కారణం ఏంటి అన్నది మాత్రం ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారిపోయింది.