ఆంధ్రప్రదేశ్ లో జనసేన బీజేపీ కలిసి పనిచేస్తున్నా..తెలంగాణలో ఈ రెండు పార్టీల మధ్య సక్యత లేదన్న సంగతి తెలిసిందే. ఇక గ్రాడ్యుయేట్ ఎన్నికల నేపథ్యంలో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. దాంతో పవన్ వ్యాఖ్యలపై తాజాగా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ స్పందించారు. జనసేన తో పొత్తుపై తాము ఇప్పటివరకూ మాట్లాడలేదని అన్నారు. బీజేపీ అన్యాయం చేస్తే తనతో మాట్లాడి ఉంటే బాగుండేదని అన్నారు. గ్రాడ్యేయేట్ ఎన్నికలపై జనసేన నాయకులతో చర్చిద్దామని చెప్పానని బండి సంజయ్ అన్నారు. మొన్నటివరకూ టీఆర్ఎస్ పార్టీని వ్యతిరేఖించిన పవన్ ఇప్పుడు అదే పార్టీకి మద్దతివ్వడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్ కల్యాణ్ తీరు సరిగ్గాలేదని విమర్శించారు. పవన్ కల్యాణ్ తీరు ప్రజలను అయోమయానికి గురిచేస్తొందని వ్యాఖ్యానించారు. ప్రజలు వ్యతిరేఖిస్తున్న పార్టీకి పవన్ కల్యాణ్ మద్దతిస్తున్నారని విమర్శించారు. ఇదిలా ఉండగా తెలంగాణలో గ్రాడ్యుయేట్ ఎన్నికల విషయంలో బీజేపీ తమతో సరిగ్గా వ్యవహరించలేదని పవన్ కల్యాణ్ అసంత్రుప్తి వ్యక్తం చేశారు. తమ పార్టీని తెలంగాణ బీజేపీ నేతలు పదే పదే వాడుకుని వదిలేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీకి సపోర్ట్ చేశామని గుర్తు చేసిన పవన్ కల్యాణ్..గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో తమను కనీసం పట్టించుకోలేదని తీవ్ర అసంత్రుప్తి వ్యక్తం చేశారు. ఇలా అయితే బీజేపీతో కష్టమేనని అన్నారు. అంతే కాకుండా తెలంగాణ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో దివంగత నాయకుడు మాజీ ప్రధాని పీవీ నరసింహారావు కుమార్తె టీఆర్ఎస్ అభ్యర్తి వాణీదేవికి తమ మద్దతు తెలుపుతున్నామని ప్రకటించారు. నిజానికి పవన్ కల్యాణ్ అసంత్రుప్తి వ్యక్తం చేయడంలో అర్థం ఉంది. జీహెచ్ఎంసీ ఎన్నికల సమయంలో అప్పటికే వివిధ వార్డులకు నామినేషన్ వేసిన జనసేన అభ్యర్థులు బీజేపీ కి మద్దతు తెలుపుతూ నామినేషన్ ను విత్ డ్రా చేసుకున్నారు. అంతే కాకుండా జనసేన కార్యకర్తలు ఎన్నికల ప్రచారంలో బీజేపీతో కలిసి ముందుడి ప్రచారం చేశారు. దాంతో జనసేన విమర్శలు కూడా ఎదురుకోవాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో తమను పట్టించుకోకపోవడంతో పవన్ అసంత్రుప్తికి గురి కావాల్సివచ్చింది.
మరింత సమాచారం తెలుసుకోండి: