గుడ్ న్యూస్.. ఆ భూములకు కూడా పట్టాదారు పాసు పుస్తకాలు..?
ఒకప్పుడు రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి కావాలి అంటే రోజుల సమయం పట్టేది. అంతేకాదు పాస్బుక్ చేతికి రావడానికి నెలల సమయం పట్టింది. అదే సమయంలో అటు పాస్ బుక్ కోసం రైతులందరూ తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అంతేకాకుండా పాటు రెవెన్యూ కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరిగినా కూడా ప్రయోజనం లేకుండా పోయేది అన్న విషయం తెలిసిందే. కానీ ఇప్పుడు ధరణి పోర్టల్ అందుబాటులోకి రావడం వల్ల ఏకంగా రోజులు గంటలు కాదు కేవలం నిమిషాల వ్యవధిలోనే రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి కావడం అంతేకాకుండా చేతికి పట్టాదారు పాస్ బుక్ రావడం జరుగుతుంది. ఇలా తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ధరణి పోర్టల్ విజయవంతం అయింది అని చెప్పాలి.
అయితే ఇప్పటి వరకు కేవలం వ్యవసాయ భూములకు మాత్రమే పట్టాదారు పాసు పుస్తకాలు ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వం. ఈ క్రమంలోనే వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్ చేసుకున్న వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయితే ఇటీవలే మరో కొత్త నిర్ణయం తీసుకుంది తెలంగాణ ప్రభుత్వం. ఇక మున్సిపాలిటీ లోనూ పాక్షిక పట్టణ స్వభావం కలిగిన భూములకు కూడా పట్టాదారు పాసు పుస్తకాల జారీ చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలోనే సెమీ అర్బన్ ల్యాండ్ లకు సూత్రప్రాయంగా పట్టా పాస్ పుస్తకాలు అందజేసేందుకు కొత్త ఆప్షను ధరణి పోర్టల్ లో అందుబాటులోకి తీసుకొచ్చింది తెలంగాణ ప్రభుత్వం. ఇక ఈ కొత్త ఆప్షన్ ద్వారా ప్రస్తుతం మున్సిపాలిటీలోని భూములకు పరిష్కారం దొరకనున్నట్లు తెలుస్తోంది.