మోడీ అదిరిపోయే వ్యూహం.. అడ్డుకునేందుకు సిద్దమైన రష్యా, చైనా, అమెరికా..?

praveen
భారత్ ప్రస్తుతం దౌత్య పరంగా ఎంతో వ్యూహాత్మకంగా దూసుకుపోతుంది అనే విషయం తెలిసిందే.  అగ్రరాజ్యాల ను సైతం ఆశ్చర్య పరిచే విధంగా ప్రస్తుతం భారత్ ముందుకు సాగుతోంది. గతంలో కేవలం ఇతర దేశాల పైన మాత్రమే ఆయుధాల కోసం ఆధారపడి ఉన్న భారత్ ఇప్పుడు మాత్రం ఏకంగా సొంతంగా ఆయుధాలు తయారు చేసుకోవడమే  కాదు ఇతర దేశాలకు విక్రయించేందుకు కూడా సిద్ధమైంది. ఇక ఆయుధ విక్రయాలను అంతకంతకూ పెంచుకోవడానికి ప్రణాళికాబద్ధంగానే ముందుకు సాగుతుంది భారత ప్రభుత్వం.

 అదే సమయంలో భారత రక్షణ రంగ పరిశోధన సంస్థ డీఆర్డీవో శరవేగంగా అదునాతన  టెక్నాలజీతో కూడిన ఆయుధాలను.. అభివృద్ధి చేస్తూ.. ప్రయోగాలు నిర్వహించి ఇక విజయవంతం అవుతూ ప్రపంచ దేశాలను సైతం ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంది  అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రస్తుతం భారత్ ముఖ్యంగా అమెరికా రష్యా చైనా లాంటి దేశాలు చులకనగా చూసే చిన్న దేశాలకు ఆయుధాలను అందించేందుకు సిద్ధం అవుతుంది . ఈ క్రమంలోనే ఇప్పటికే పలు చిన్న దేశాలతో భారత్ ఒప్పందం కుదుర్చుకుంది అన్న విషయం తెలిసిందే.

 ఏకంగా అమెరికా ఆంక్షలు విధించినప్పటికీ కూడా ఫిలిప్పైన్స్ కి భారత్ ఎంతో ప్రతిష్టాత్మకంగా అభివృద్ధి చేసిన బ్రహ్మోస్ మిస్సైల్ అందించేందుకు సిద్ధం అయింది అన్న విషయం తెలిసిందే. అయితే ఫిలిఫైన్స్ కి భారత్ బ్రహ్మోస్ మిస్సైల్ ఇచ్చేందుకు సిద్ధపడటం  మాత్రం అటు రష్యా అమెరికా చైనా దేశాలకు నచ్చడం లేదు. ఇకపోతే ఫిలిఫైన్స్ దేశానికి భారత్ బ్రహ్మోస్ మిస్సైల్ అందించేందుకు సిద్ధమవటం వెనుక  ఎన్నో వ్యూహాలు ఉన్నాయి అని అంటున్నారు విశ్లేషకులు.  ప్రస్తుతం చైనా అవతల ఉన్న చిన్న దేశం అయినప్పటికీ చైనాతో  ఎప్పటికీ విబేదిస్తూ  ఉంటుంది. ఇక చిన్న దేశం కావడంతో అక్కడ ఆయుధాల కొరత కూడా ఉంటుంది. ఇక అమెరికా రష్యా లాంటి దేశాలు డబ్బులు చెల్లిస్తామని చెప్పినప్పటికీ లాంటి చిన్న దేశాలను  చులకనగా చూస్థాయి. ఈ క్రమంలోనే ముందుకు వచ్చిన భారత్ ఫిలిఫైన్స్ కి  బ్రహ్మోస్ మిస్సైల్ అందించేందుకు సిద్ధం అయింది.

 ఇక ప్రస్తుతం చిన్న దేశాలన్నింటికీ ఆయుధాలను అందిస్తు  ఒక నమ్మదగ్గ మారిపోయింది భారత్. మొన్నటి వరకూ వ్యాక్సిన్  విషయంలో  నమ్మదగ్గ దేశంగా భారత్ మారిపోగా.. ఇక ఇప్పుడు ఆయుధాల విషయంలో కూడా చిన్న దేశాలకు సహాయం చేసేందుకు ముందుకు వస్తుంది భారత్. అదే సమయంలో  ఇక భారత ఆయుధ విక్రయాలను కూడా అంతకంతకూ పెంచుకోవాలని భావిస్తోంది అయితే భారత్ అంతకంతకు ఆయుధ విక్రయాలలో వృద్ధి సాధిస్తూ ఉండడం అటు అగ్రరాజ్యాలకు మాత్రం అస్సలు ఇష్టం లేదు. ఈ క్రమంలోనే భారత ఆయుధ విక్రయాలను అడ్డుకునేందుకు చైనా రష్యా అమెరికా దేశాలు ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: