ఏపీ సీఎం జగన్ కి జీతమెంతో తెలుసా...? తెలిస్తే షాక్ అవుతారు...?

VAMSI
పోలీసులకు, టీచర్లకు వైద్యులకు ఇలా పలు రకాల బాధ్యతలను చేపట్టే వారికి వేతనాలు వస్తాయి అని అందరికీ తెలుసు. కొంతమంది అయితే నేను ఫలానా జాబ్ చేస్తున్నాను అనగానే.. టక్కున మీకు ఎంత జీతం అని అడిగేస్తారు. ఇది అందరూ అడిగే సాధారణ ప్రశ్నే. ఇతరుల జీవితాల గురించి తెలుసుకోవడానికి అందరూ ఆసక్తి చూపుతుంటారు. అయితే మన రాష్ట్రాన్ని పరిపాలించే ముఖ్యమంత్రులకు కూడా జీతం వస్తుందా అంటే...??? ఈ విషయం పై చాలా మందికి క్లారిటీ ఉండక పోవచ్చు. అయితే వాస్తవానికి ముఖ్యమంత్రికి సైతం వేతనాలు చెల్లిస్తుంది ప్రభుత్వం. ఇదే విధంగా మన దేశంలోని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు జీతం అందుతోంది.
అయితే ఇక్కడ మరో విశేషం ఏమిటంటే.. దేశంలోని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు కల్లా... తెలంగాణ  సీఎం కె సి ఆర్... కి ఎక్కువ జీతం లభిస్తుంది. కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు నెలకు రూ.4.10 లక్షల జీతం వస్తోంది. వీటితో పాటు హౌస్ అలవెన్స్, టెలిఫోన్ బిల్లులు, అంతరాష్ట్ర ప్రయాణ ఖర్చులు, వంటి అదనపు అలవెన్సులు కూడా  అదనంగా అందుతున్నాయి.. ఇక రెండవ స్థానంలో చూస్తే...ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రివాల్ కు నెలకు రూ.4 లక్షల జీతం అందుతోంది. ఇది కాకుండా ఇతర అలవెన్సులు కూడా లభిస్తున్నాయి. ఇక పోతే మూడో స్థానంలో...ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఉన్నారు. ఈయనకు నెలకు 3లక్షల 65 వేల రూపాయల జీతం మరియు అలవెన్స్ లు లభిస్తున్నాయి.
మరియు 4వ స్థానంలో..మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే ఉన్నారు. ఈయనకు నెలకు జీతం మూడు లక్షల 40వేల రూపాయల అందుతోంది. కానీ వాస్తవానికి నాలుగో స్థానంలో ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఉండాల్సింది. వాస్తవ లెక్క ప్రకారం చూస్తే ఈయనకు నెలకు జీతం 3 లక్షల 35 వేలు. కానీ రాష్ట్రం అప్పుల్లో ఉన్న కారణంగా ఈయన నెలకు ఒక్క రూపాయి మాత్రమే జీతం తీసుకుని ప్రజలకు సేవ చేస్తానని హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారమే పని చేస్తున్నారు. కాబట్టి ఈయన దేశంలోని రాష్ట్రాల ముఖ్యమంత్రులు తీసుకొనే జీతాల లిస్టులో... అత్యల్ప జీతం పొందే ముఖ్యమంత్రిగా స్థానంలో ఉన్నారు. ఇక టాప్ ఫైవ్ లో గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ ఉన్నారు. ఈయనకు నెలకు జీతం మూడు లక్షల 21వేల రూపాయలు అందుతోంది. మిగిలిన రాష్ట్ర ముఖ్యమంత్రులు తదితర స్థానాల్లో ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: