మార్కెట్లోకి జియో ల్యాప్ టాప్ లు వస్తున్నాయట.. తెలుసా.. !!
అసలు ఈ జియో బుక్ అంటే ఏంటో ఒకసారి తెలుసుకుందాం. సెల్యులార్ కనెక్షన్‌తో పనిచేసే ల్యాప్‌టాప్‌ల తయారీపై జియో ఆసక్తిగా చూపుతున్న విషయం తెలిసిందే. అంటే సాధారణ ల్యాపీల్లా విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టంతో కాకుండా, గూగుల్ ఆండ్రాయిడ్ ఓఎస్‌తో ఇవి పని చేయడం ఆసక్తికర విషయం. ఆండ్రాయిడ్ ఓఎస్‌లో కొన్ని మార్పులు చేసి ఈ ల్యాపీల్లో వాడనున్నారు. దీనిని జియో ఓఎస్ అని పిలుస్తారని సమాచారం
ఇకపోతే జియోబుక్ ఫీచర్ల గురించి తెలుసుకుంటే
ఇందులో జియో క్వాల్కోమ్ స్నాప్‌డ్రాగన్ 665 ప్రాసెసర్‌ను ఉపయోగిస్తున్నారట. ఇది 11 నానో మీటర్ టెక్నాలజీతో పని చేస్తుంది. ఇప్పటికే అనేక మొబైల్ ఫోన్లలో ఈ చిప్‌ను వినియోగిస్తున్నారు. దీనిలో ఇన్-బిల్ట్ 4జీ ఎల్‌టీఈ మోడెమ్ ఉంటుంది. ఇందులో వీడియోల కోసం మినీ హెచ్‌డీఎంఐ, 5 గిగా హెడ్జ్ వైఫై సపోర్ట్, బ్లూటూత్, 3 యాక్సిస్ యాక్సెలెరోమీటర్, క్వాల్‌కోమ్ ఆడియో చిప్‌లను వినియోగించనున్నారు. అంతే కాకుండా ఈ ల్యాప్‌టాప్‌లో జియో స్టోర్, జియో మీట్, జియో పేజెస్, జియో యాడ్ సర్వీసులను ముందుగానే లోడ్ చేసి ఉంచుతారని సమాచారం. ఈ ల్యాపీ ధర మీద ఇంకా ఎలాంటి సమాచారం లేదు. అన్నీ కుదిరితే ఈ ఏడాది మే నాటికి జియో బుక్‌లు అందుబాటులోకి రావొచ్చు.