ఎండలు మండుతున్నాయ్ కదా అని పిల్లలకు ఇవి ఇవ్వకండి.. !!

Suma Kallamadi
బయట కొంచెం వేడిగా ఉంటే చాలు కూలింగ్ నీళ్లు తాగాలని చిన్న పెద్ద అందరు అనుకుంటారు ముఖ్యంగా, ఫ్రిజ్ లో పెట్టిన నీటిని తాగాలంటే మహా ఇష్టంగా ఉంటారు..మరి ముఖ్యంగా చిన్న పిల్లలు ఐస్ వారేరి తాగడానికి భలే ఉత్సహం చూపిస్తూ ఉంటారు. కానీ పిల్లలు  చల్లని నీటిని తాగడం వలన వాళ్ళ ఆరోగ్యం పాడవుతుంది అని వైద్యులు తెలియచేస్తున్నారు.ఎందుకు అనుకుంటున్నారా.. !!


పిల్లలకు  చల్లని నీరు తాగించడం వలన  ఆ చిన్నారుల ఆరోగ్యానికి అవసరమైన పోషకాలు అందకుండా పోతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకే వేసవి కాలంలో కూడా పిల్లలకు చల్లని నీటికి ప్రత్యామ్నాయంగా వేరేవి అలవాటు చేయండి.. ఫ్రిజ్ నీరుకు బదులుగా ప్లెయిన్‌ ఫిల్టర్‌ వాటర్‌ ను వారికీ ఇవ్వాలి. ఈ నీటి లో  ఎటువంటి హాని కారక రసాయనాలు ఉండవు. అలాగే,చక్కగా మట్టి కుండలో నీళ్లు తాగిస్తే మరి మంచిది. కొంతమంది పిల్లలు అయితే పాలు తాగడానికి ఇష్టపడరు. అలాంటి వారిలో లాక్టోజెన్ లోపం వస్తుంది .అందుకే  పాలు తాగడానికి ఇష్ట పడని పిల్లలకు సోయా మిల్క్‌ తాగడం అలవాటు చేయాలి. సోయలో ఖనిజాలు, ప్రొటీన్లు అధిక మోతాదులో ఉండడం వలన పిల్లలు శారీరకంగా ఎదుగుతారు .



మరి కొందరు పిల్లలు బాదంపప్పు, జీడిపప్పు వంటి గింజలను తినడానికి ఇష్టపడరు. ఇలాంటి వారికి ప్రొటీన్లు, న్యూట్రిన్లు అధికం గా ఉండే బాదం పాలు ప్రయోజనకరం గా ఉంటాయి. దీనితో తక్కువ కొవ్వులు కలిగిన పీచుపదార్థం కూడా అందుతుంది. అలాగే గ్లూకోస్, ఎలక్టో ల్రైట్స్‌ కూడా  పిల్లల ఆరోగ్యానికి చాలా అవసరం. వీటిలో చక్కెర పాళ్లు తక్కువ గా ఉంటాయి. అలాగే పిల్లల  ఆరోగ్యానికి పుచ్చకాయ, బత్తాయి, ఆపిల్‌ మామిడి, జ్యూస్‌లు ఎంతో మంచివి . వీటితో పాటు ఎండా కాలం లో పిల్లల దాహాన్ని తీర్చడానికి నిమ్మ రసం ఇవ్వడం మాత్రం మరువద్దు. అలాగే ఎండాకాలం మజ్జిగకు మించిన మందు మరొకటి లేదనే చెప్పాలి. అలాగే లస్సి కూడా తాగడం మీ పిల్లలకు అలవాటు చేయండి.. !!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: