ఆ రోజు షర్మిల ఎమోషన్ అంతా నాటకమేనా.. బిజెపి అసలు నిజం తేల్చేసింది..?
ఇక గతంలో టిఆర్ఎస్ పార్టీకి చెందిన నేతలు షర్మిల పార్టీపై విమర్శలు గుప్పించినప్పటికీ.. ప్రస్తుతం కాస్త సైలెంట్ గానే ఉండి పోయారు అన్న విషయం తెలిసిందే అయితే ఇటీవలే అటు బీజేపీ మాత్రం షర్మిల పెట్టబోయే పార్టీ గురించి ఇటీవల జరిగిన ఓ సంఘటనను ఉద్దేశిస్తూ ఆసక్తికర విషయాన్ని తెరమీదకు తీసుకురావడంతో ఇది కాస్త తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారిపోయింది. ఇటీవల షర్మిల ఒక సభ నిర్వహించిన సమయంలో ఒక యువకుడు లేచి అక్క మీరు ఉండాలి అక్క.. అంటూ ఎమోషనల్ గా చెప్పడం నేను మీతోనే ఉంటాను మిమ్మల్ని చూసుకుంటాను అంటూ షర్మిల సమాధానం ఇవ్వడం ఇదంతా ఎమోషన్ బాగా పండింది
అయితే ఇదే విషయంపై బిజెపి పార్టీ... కొత్త విషయాన్ని తెరమీదికి తెచ్చింది. ఆ రోజు షర్మిల కార్యక్రమంలో మాట్లాడిన యువకుడు స్టూడెంట్ కాదని.. కల్వరి టెంపుల్ లో డ్రమ్స్ వాయిస్తూ ఉంటాడని... అతని మీద పలు పోలీస్ స్టేషన్ లలో వివిధ రకాల కేసులు కూడా ఉన్నాయి.. షర్మిల ప్రజలను బురిడీ కొట్టించేందుకు అంత డ్రామా ఆడిందని అంటూ బీజేపీ కొత్త విషయం తెర మీదికి తెచ్చింది. ఇది నిజమా అబద్దమా అన్నది ప్రస్తుతం షర్మిల వర్గం తేల్చాల్సిన అవసరం ఉంది అని అంటున్నారు విశ్లేషకులు.