వామ్మో.. అక్కడ ఫోర్త్ వేవ్.. ఏకంగా దేశ అధ్యక్షుడే..?
అయితే ప్రస్తుతం అన్ని దేశాలలో భారీ కేసులు నుంచి తక్కువ కేసులు నమోదు వుంటే కొన్ని దేశాలలో మాత్రం తక్కువ కేసులు నుంచి భారీ కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటికి కూడా వైరస్ ను నియంత్రించడంలో పూర్తిగా విఫలం అయ్యాయి అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇలా కరోనా వైరస్ నియంత్రించడంలో విఫలం అయిన దేశాలలో ఇరాన్ కూడా ఒకటి అన్నది తెలుస్తుంది. అయితే ఇప్పటి వరకు ప్రపంచ దేశాలలో మొదటి వేవ్ తో పాటు సెకండ్ వేవ్ వరకు మాత్రమే అందరికీ తెలుసు. కానీ ఏకంగా ఇరాన్లో ఏకంగా ఫోర్త్ వేవ్ వైరస్ విజృంభిస్తున్నట్టు ఇటీవల ఇరాన్ అధ్యక్షుడు ప్రకటించడం ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశం గా మారింది.
ప్రస్తుతం ఇరాన్ లో కనీసం అక్కడి ప్రజలకు ఆహారం అందించే స్థితి కూడా లేదు. అంతలా తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిన ఇరాన్ అటు వైరస్ ను కంట్రోల్ చేయడంలో రోజురోజుకు విఫలం అవుతూనే ఉంది. తద్వారా అక్కడ వైరస్ కేసుల సంఖ్య పెరిగిపోతుంది తప్ప ఎక్కడా తగ్గడం లేదు. ఇక ఇరాన్ కి సహాయం చేసేందుకు ఏ దేశం కూడా ముందుకు రావడం లేదు. అమెరికా ఆంక్షలు విధించడంతో పాటు మరోవైపు ప్రపంచ దేశాలు కూడా ఇరాన్ పై ఆంక్షలు విధించడంతో ప్రస్తుతం దిక్కుతోచని స్థితిలో పడిపోయింది. ప్రస్తుతం వైరస్ కారణంగా ఎంత మంది చనిపోయారో కూడా లెక్క చెప్పలేని దుస్థితిలో ఉంది ఇరాన్. ఇలా ప్రపంచ దేశాలన్నింటిలో ఎక్కువ కేసులు నుంచి తక్కువ కేసులు నమోదు అవుతుంటే ఇరాన్ లో మాత్రం ఏకంగా తక్కువ కేసు నుంచి ఎక్కువ కేసులు నమోదు ప్రస్తుతం ఫోర్త్ వేవ్ కొనసాగుతుంది అని ఏకంగా ఆ దేశ అధ్యక్షుడు ప్రకటించడం సంచలనంగా మారింది.