ఈ బ్యాంకులో అకౌంట్ ఉందా.. అయితే మీకే ఈ హెచ్చరిక..?
వివిధ రకాల బ్యాంకులు తమ బ్యాంక్ ఐఎఫ్ఎస్సి కోడ్ నెంబర్లను మారుస్తున్నాయి. కస్టమర్లు కూడా వెంటనే ఐఎఫ్ఎస్సి కోడ్ నెంబరు మార్చుకోవాలి అంటూ ఆయా బ్యాంకులు సూచిస్తున్నాయి. ఒకవేళ మీకు అలహాబాద్ బ్యాంకులో అకౌంట్ ఉంటే మీరు కచ్చితంగా ఇలా ఐఎఫ్ఎస్సి కోడ్ మార్చుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ అలా మార్చుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఆన్లైన్లో ఇతరులకు డబ్బు పంపించడం అస్సలు కుదరదు. అలహాబాద్ బ్యాంక్ ఇండియన్ బ్యాంకు లో విలీనం అయింది అన్న విషయం తెలిసిందే.
ఈ క్రమంలోనే బ్యాంక్ ఐఎఫ్ఎస్సి కోడ్ లు పూర్తిగా మారిపోయాయి. ఈ క్రమంలోనే పాత కోడ్ లు ఇక పనిచేయవు. ఒకవేళ మీరు డబ్బులు పంపించాలి అంటే కొత్త కోడ్ ఎంచుకోవాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే ఎలా ఈ కొత్త ఐఎఫ్ఎస్సి కోడ్ మార్చుకోవాలో తెలియక ఎంతోమంది కస్టమర్లు అయోమయం లో మునిగిపోయారు. దీనికోసం పెద్దగా కష్టపడాల్సిన పనిలేదు.. దీనికోసం ఐఎఫ్ఎస్సి అని టైపు చేసి స్పేస్ ఇచ్చి పాత ఐఎఫ్ఎస్సి కోడ్ఎంటర్ చేసి..9266801962 నెంబరుకు ఎస్ఎంఎస్ పంపితే సరిపోతుంది ఇక కొత్త కోడ్ అప్డేట్ అవుతుంది. కేవలం అలహాబాద్ బ్యాంక్ మాత్రమే కాదు ఇతర బ్యాంకులు కూడా తమ ఐఎఫ్ఎస్సి కోడ్ మారుస్తున్నాయి. ఈ క్రమంలోనే తమ కస్టమర్లను కొత్త ఐఎఫ్ఎస్సి కోడ్ పొందాలి అంటు ఆయా బ్యాంకులు సూచిస్తున్నాయి