షర్మిల పార్టీ పెడితే...కేసీఆర్ కు సెగ తప్పేలా లేదు ?

VAMSI
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి కుమార్తె వైఎస్ షర్మిల తెలంగాణలో నూతన రాజకీయ పార్టీ ఆవిష్కరణ చర్చనీయాంశంగా మారింది. తండ్రి రాజశేఖర్ రెడ్డి ఇచ్చిన స్ఫూర్తితో ముందుకు అడుగులు వేస్తూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా స్థానాన్ని దక్కించుకున్నారు వైయస్ జగన్ మోహన్ రెడ్డి. అంతేకాదు తండ్రి చూపిన బాటలో నడుస్తూ ప్రజల చేత జేజేలు పలికించుకుంటున్నారు జగన్. ఇప్పుడు అదే తండ్రికి తగ్గ వారసురాలిగా.. అన్నకు తగ్గ చెల్లెలుగా... ఒక గొప్ప నాయకురాలిగా తన సత్తా చాటుకోవాలని ముందుకు వెళ్తున్నారు వైయస్ షర్మిల.
 
అయితే ఒకవేళ ఆంధ్రప్రదేశ్లోనే పార్టీ పెడితే అన్న జగన్ కు తనకి మధ్య మనస్పర్ధలు వస్తాయని అందరూ అనుకుంటారేమో అని తెలంగాణలోని  పార్టీ పెట్టేందుకు సిద్ధమైంది. మొత్తానికి మొన్న జరిగిన మీటింగ్ తో తెలంగాణలో షర్మిల  పార్టీ పెట్టడం ఖాయం అన్న నిర్ణయానికి అందరూ వచ్చేశారు.... ఇది నిజంగా ఒక సంచలనమైన అంశమని చెప్పాలి. రాజకీయరంగంలో ఇలాంటి ఊహించని పరిణామాలు చోటుచేసుకోవడం కొత్తేమీ కాదు. ఇలాంటి ఎన్నో ఊహించని సంఘటనలు తరచూ జరుగుతూ ఉంటాయి. అయితే ఇప్పుడు రాజకీయరంగంలో భారీ మార్పులు జరగనున్నాయని అనుకుంటున్నారు.

తెలంగాణలో రాజన్న రాజ్యం స్థాపిస్తానంటూ.. షర్మిల చేసిన ప్రకటన అనంతరం ఇప్పుడు పార్టీ పెట్టాక ఆమెతో కలిసి వచ్చే నేతలు ఎవరు అన్నది చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్ పార్టీ హవా తగ్గుతున్న సమయంలో ఆ పార్టీలోని కొందరు కీలక నాయకులు షర్మిల పంచన చేరుతారు ఏమో అన్న వార్తలు వినబడుతున్నాయి. ఇటు అధికార పార్టీ టిఆర్ఎస్ లో ఉన్న వైఎస్ అభిమానులు సైతం.... వైఎస్ కుటుంబంపై ఉన్న అభిమానంతో షర్మిల పార్టీ వైపు చూసే అవకాశం ఉందంటున్నారు.

 ప్రముఖ నాయకులుగా ఉన్న మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, సునీతా లక్ష్మారెడ్డి, దానం నాగేందర్ తో పాటు.. మరికొందరు నాయకులు వైఎస్ తో గట్టి సంబంధాలు ఉన్నవారే. ఇప్పుడు వీరు ఆ కుటుంబంపై ఉన్న అభిమానంతో  షర్మిలతో ముందుకు నడిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పుడు వైయస్ షర్మిల పార్టీలో చేరనున్న నేతలు ఎవరు అన్న విషయం  రాజకీయ వర్గాల్లో సంచలనం రేపుతోంది. ఒకవేళ అలా జరిగితే తెలంగాణ సీఎం కెసిఆర్ కు ఇబ్బందులు తప్పేలా లేవని రాజకీీయ ప్రముఖులు అభిప్రాయపడుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: