వారెవా..! ఆజాద్‌- మోడీ సంభాషణ.. ప్రతి ఇండియన్‌ గర్వపడేలా..?

Chakravarthi Kalyan
ముందు దేశం.. ఆ తర్వాతే కులం.. ముందు దేశం ఆ తర్వాతే మతం.. ముందు దేశం.. ఆ తర్వాతే ప్రాంతం.. ముందు దేశం.. ఆ తర్వాతే భాష.. ముందు దేశం.. ఆ తర్వాతే సంస్కృతి..  ఇదే ప్రతి భారతీయుడు గర్వించాల్సిన మన వారసత్వం.. ఇదే ప్రతి భారతీయుడు గుర్తించాల్సిన భారత ఔన్నత్యం.. ఇదే ప్రతి భారతీయుడు నేర్చుకోవాల్సిన గొప్ప విషయం. నిన్న రాజ్యసభలో కాంగ్రెస్ నేత ఆజాద్‌, ప్రధాని మోడీల సంభాషణ.. ప్రతి ఒక్కరూ తప్పక చూసి తీరాల్సిన దృశ్యం.
ముఖ్యంగా కాంగ్రెస్ నేత గులాం నబీ ఆజాద్‌ ప్రసంగం అద్వితీయం.. గులాం నబీ ఆజాద్‌ ఓ ముస్లిం నేత.. అందులోనూ కాశ్మీరీ ముస్లిం నేత. అయినా ఆయన తన దేశం పట్ల ఎంత గర్వంగా నిబద్దతతో ఉన్నారో.. ఆయన మాటలను బట్టి చూస్తే అర్థమవుతోంది. ఆయన ప్రసంగంలో దేశం పట్ల ప్రేమ ఉట్టిపడింది. హిందుస్థానీ ముస్లింగా గర్వపడుతున్నానని ఆయన అన్నారు. హిందుస్థానీ ముస్లింగా తాను గర్వపడుతున్నానని కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు, రాజ్యసభలో విపక్షనేత గులాం నబీ ఆజాద్‌ పేర్కొన్నారు.
ఇప్పటివరకు తాను పాకిస్థాన్ వెళ్లలేదు, నిజంగా తాను అదృష్టవంతుడిని అని భావిస్తున్నానన్నారు ఆజాద్. పాకిస్థాన్‌ వెళ్లని అదృష్టవంతులలో తానూ ఒకడిని అన్నారు. పాక్ పరిస్థితుల గురించి చదివినప్పుడు, హిందుస్థానీ ముస్లింగా గర్వపడుతానని రాజ్యసభలో తన పదవీ విరమణ ప్రసంగంలో గులాం నబీ ఆజాద్‌ అన్నారు. కీలకమైన సమయాల్లో సభను ఎలా నడపాలి అనే విషయాలతో పాటు మరెన్నో అంశాలను మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయీ‌ నుంచి నేర్చుకున్నానని ఆజాద్‌ స్పష్టంచేశారు. మాజీ ప్రధాని వాజ్‌పేయీ‌కు నివాళులు అర్పించారు.
వీడ్కోలు సందర్భంగా సభ్యులందరితో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్న ఆజాద్‌, వారందరి సహకారానికి ధన్యవాదాలు తెలిపారు. తన పదవీ విరమణ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన ప్రసంగానికి ఆజాద్ ధన్యవాదాలు తెలిపారు. అంతకుముందు.. ఆజాద్‌ సేవలను కీర్తించిన ప్రధాని నరేంద్ర మోదీ, ఒకానొక సమయంలో తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. దేశం కోసం ఆందోళన చెందే వ్యక్తి ఆజాద్‌ అని ప్రధానమంత్రి కొనియాడారు. కన్నీరు పెట్టుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: