లైంగిక వేధింపుల కేసులో తీర్పునిచ్చిన పుష్ప గనేడివాలా బ్యాక్ గ్రౌండ్ ఏంటి..?
అది మరిచిపోకముందే ఆమె మరోసారి తన తరహా లో మరో తీర్పు చెప్పి అందరిని మరోసారి ఆశ్చర్యంలో ముంచింది. బాలిక చేతులు కట్టేసి, వాటిని పట్టుకుని ప్యాంట్ జిప్ తీసీనంత మాత్రాన పోక్సో చట్టం కింద నేరం కాదని ఆమె తీర్పు చెప్పారు. బాధితురాలు ప్రతిఘటిస్తే ఆమెను వివస్త్ర ను చేయడం సాధ్యం కాదని బాధితురాలి సాక్ష్యాన్ని పరిగణనలోకి తీసుకోవడం కుదరదని తీర్పు చెప్పారు. దీంతో పుష్పకు సంబంధించి శాశ్వత న్యాయమూర్తి నియామకం సిఫార్సులను వెనక్కి తీసుకోవాలని సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకుది.
ఇలాంటి సంచలన తీర్పుల నేపథ్యంలో ఎవరీ పుష్ప అని వెతికే వారి సంఖ్య ఎక్కువయ్యింది. మహారాష్ట్రలోని అమరావతి జిల్లాలో గల పరాఠ్వాడాలో 1969లో జన్మించారు. బీకాం, ఎల్ఎల్బీ, ఎల్ఎల్ఎం పట్టాలు తీసుకున్నారు. 2007లో తొలిసారి జిల్లా జడ్జిగా నియమితులయ్యారు. ముంబైలోని సిటీ సివిల్ కోర్టు, నాగపూర్ జిల్లా ఫ్యామిలీ కోర్టు న్యాయమూర్తిగా పనిచేశారు. ఆ తర్వాత 2018లో జస్టిస్ పుష్ప బొంబాయి హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. అయితే న్యాయస్థానం వ్యతిరేకించడంతో ఆమె కొన్నాళ్ల పాటు నిరీక్షించాల్సి వచ్చింది. సుప్రీంకోర్టు అందుకు సానుకూలంగా స్పందించడంతో ఆమెకు నిరాశే మిగిలింది. అయితే, 2019లో జస్టిస్ పుష్ప నియామకం ఖరారైంది. దాంతో బొంబాయి హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా ఆమెకు అవకాశం దక్కింది.