బ్రాహ్మణ ఘోష: బ్రాహ్మణులారా ఏకం కండి...హక్కుల కోసం పోరాడండి...?
అందులోనూ బ్రాహ్మణులు ఎక్కువగా గౌరవించబడుతున్నారు అని చెబుతున్నారు అధికారంలో ఉన్న వైసీపీ నాయకులు. బ్రాహ్మణులు కూడా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని ఎన్నో పథకాలు రూపొందించడం జరిగింది. కానీ ఇవన్నీ కార్యరూపమ దాల్చడం లేదన్నది ప్రతిపక్షాల వాదన మరియు విమర్శలు. అప్పట్లో వైసీపీ నేత కోన రఘుపతి బ్రాహ్మణుల గురించి మాట్లాడుతూ అటు తెలంగాణ ఇటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు బ్రాహ్మణుల పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపుతోందని... వీరి కోసం ఎన్నో సంస్కరణలు ఆవిష్కరించడం జరిగిందని పేర్కొన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ బ్రాహ్మణులకు తగిన గుర్తింపు లభించిందని వారి కోసం ప్రత్యేక సేవలు అందిస్తున్నట్లు తెలిపారు.
విద్య, వైద్య , వ్యాపార పరంగాను బ్రాహ్మణులకు తగిన ప్రోత్సాహం అందించిన ఘనత తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు, వైయస్ జగన్మోహన్ రెడ్డి లకు దక్కుతుందని గర్వంగా చెప్పారు. బ్రాహ్మణులకు తగిన న్యాయం జరగడం లేదన్న ఆరోపణలలో ఎంత మాత్రం వాస్తవం లేదని పేర్కొన్నారు. ఐదు వేల రూపాయల పెట్టుబడితో విజయవంతమైన వ్యాపారవేత్తగా ఎదగడానికి ఒకప్పుడు ఆయన చేసిన ప్రయత్నాలు గుర్తు చేసుకున్న ఆయన... ఈ సందర్భంగా బ్రాహ్మణులు వ్యాపార, రాజకీయ రంగాలలో అభివృద్ధి చెందడానికి తాను ఎప్పుడూ అండగా ఉంటానని ప్రతిజ్ఞ చేశారు. వంద కోట్ల రూపాయల మూలధనంతో బ్రాహ్మణుల కోసం ఏపీ ప్రభుత్వం కార్పొరేషన్ ను ప్రారంభించిందని... ఇది ఎంతో గర్వించదగ్గ విషయమని ప్రశంసించారు.
రెండు లక్షల లోపు వార్షిక ఆదాయం ఉన్నవారికి కార్పొరేషన్ తరపు నుండి సబ్సిడీ కూడా అమలులో ఉన్నట్లు ఆయన మరోసారి గుర్తు చేశారు. ఇలా తెలుగు రాష్ట్రాలలో ఉన్న అధికార పార్టీలు బ్రాహ్మణుల అభివృద్ధి కోసం ప్రత్యేక శ్రద్ధ పెట్టినట్లు... సాయం కోసం ఎదురుచూసే ప్రతి ఒక్కరికి ఆసరా ఇచ్చేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నట్లు స్పష్టం చేశారు. ఇదంతా అధికార ప్రభుత్వం చెబుతున్న మాటలు. అయితే వాస్తవంగా జరుగుతున్నది మాత్రం దీనికి పూర్తి భిన్నంగా ఉందని బ్రాహ్మణ పెద్దలు చెబుతున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో బ్రాహ్మణులారా.. జాగృతం కండి. మీ హక్కులు తెలుసుకోండి..! ఓటు బ్యాంకుగా ఉపయోగపడుతున్నారే తప్ప... మీ సమస్యలు పరిష్కరించేందుకు ఏ రాజకీయ పార్టీ కూడా ముందుకు రావడం లేదనే విషయాన్ని గుర్తించండి. ప్రభుత్వాలు మారినా.. మీ సమస్యలు మాత్రం తీరడం లేదు. ఎప్పటికప్పుడు సమస్యలు పెరుగుతున్న నేపథ్యంలో వాటిని పరిష్కరించేందుకు ఏ ఒక్కరూ బాధ్యతలు తీసుకోవడం లేదు. ఈ నేపథ్యంలో మీ గళాన్ని వినిపించేందుకు https://www.indiaherald.com/ ముందుకు వచ్చింది. బ్రాహ్మణుల సమస్యలను ప్రభుత్వానికి చేరవేసేందుకు https://www.indiaherald.com/ ప్రయత్నిస్తోంది. దీనిలో మీ భాగస్వామ్యమే కీలకం. మీ సమస్య ఏదైనా.. ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్లేందుకు మేం ముందుంటాం.