జగడ్డ: నిమ్మగడ్డ శీలానికి ఇదే అసలైన పరీక్ష..?

Chakravarthi Kalyan
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ దూకుడు పెంచారు.. దశాబ్దాల క్రితం పని చేసిన ఎన్నికల కమిషనర్ శేషన్‌ను తలపిస్తున్నారు. అయితే ఆయన చర్యలన్నీ టీడీపీకి అనుకూలమన్న విమర్శలు ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటి వరకూ ఆయన చర్యలు కూడా అందుకు ఆస్కారం కలిగించాయి. అయితే ఇప్పుడు నిమ్మగడ్డ శీలానికి అసలైన పరీక్ష ఎదురవుతోంది. ఎందుకంటే.. తెలుగుదేశం అధినేత చంద్రబాబు పై ఎస్ఈసీ కి వైసీపీ నాయకులు ఫిర్యాదు చేస్తున్నారు.
విడతల వారీగా వైసీపీ శ్రేణులు నిమ్మగడ్డకు ఫిర్యాదు చేస్తున్నాయి. ఎస్ఈ సీకి వైసీపీ లీగల్ సెల్ రాష్ట్ర శాఖ కార్యదర్శి సి.హెచ్.సాయిరామ్ మొదట ఫిర్యాదు చేశారు. పంచాయతీ ఎన్నికలకు చంద్రబాబు మేనిఫెస్టో విడుదల చేయడంపై ఎస్ఈసీకి ఫిర్యాదు చేశారు. ఎన్నికల నియమావళికి  విరుద్దంగా చంద్రబాబు మేనిఫెస్టో విడుదల చేశారని ఫిర్యాదు చేశారు. చంద్రబాబు నాయుడిపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఎస్ఈసీ ని వైసీపీ కోరింది.
ఆ తర్వాత వైకాపా ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి సారథ్యంలో కొందరు రాష్ట్ర ఎన్నికల సంఘం ఉన్నతాధికారులను కలిశారు. తెదేపా మేనిఫెస్టో విడుదల, మొబైల్ యాప్ వినియోగించకపోవడం అంశాలపై ఫిర్యాదు చేశారు. ఈ రెండు అంశాలపై ఎస్ఈసీ అధికారులకు  మెమోరాండం ఇచ్చామని వైకాపా ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి తెలిపారు. చంద్రబాబునాయుడు మేనిఫెస్టోను విడుదల చేసి ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారని తెలిపారు.
రాష్ట్రంలో తప్పుడు విధానం కొనసాగుతోంది..విధానం మార్చుకోవాలని వైకాపా ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి అన్నారు. చంద్రబాబుపై కేసులు పెట్టడం సహా  చర్యలు తీసుకోవాలని కోరామన్నారువైకాపా ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి. ఎన్నికల్లో అక్రమాల నివారణకు యాప్ ను రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే  సిద్దం చేసిందని.. ప్రభుత్వం చేసిన యాప్ ను ఎస్ఈసీ పక్కనపెట్టి సొంతంగా తయారు చేస్తున్నారని వైకాపా ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి ఆరోపించారు.  సీ విజిల్ ను ఎన్నికల కమిషన్ దేశవ్యాప్తంగా తయారు చేసి వినియోగిస్తోందని.. సీ విజిల్ యాప్ నైనా రాష్ట్రంలో  అందుబాటులో తీసుకురావాలని ఎస్ఈసీ ని కోరామన్నారు. మరి ఈ ఫిర్యాదులపై నిమ్మగడ్డ చర్య తీసుకుంటారా..? 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: