కాపు వేద‌న‌: కాపుల వైపు.. బీజేపీ చూపు.. న‌మ్మ‌కం క‌లిగించేనా?

VUYYURU SUBHASH
రాష్ట్రంలో రాజ‌కీయ ప‌రిణామాలు వ‌డివ‌డిగా మారుతున్నాయి. కీల‌క‌మైన ఓటు బ్యాంకుగాను.. మూడు జిల్లాల్లో అత్యంత ప్ర‌భావిత‌మైన రాజ‌కీయాలు న‌డిపించే శ‌క్తిగాను ఉన్న కాపుల విష‌యంలో బీజేపీ అనూహ్యంగా పావులు క‌దుపుతోంది. ఇప్ప‌టికి.. గ‌త ఎన్నిక‌ల‌కు ముందు నుంచి రాష్ట్ర బీజేపీని కాపు సామాజిక వ‌ర్గానికి చెందిన నాయ‌కులు న‌డిపిస్తున్నారు. గ‌తంలో కాపు నాయ‌కుడు, మాజీ మంత్రి క‌న్నా లక్ష్మీనారాయ‌ణ బీజేపీ న‌డిపించారు. ఈ క్ర‌మంలో కాపుల‌కు పెద్ద‌పీట ప‌డుతుంద‌ని అనుకున్నా.. ఆయ‌న వ్యూహాత్మ‌కంగా క‌మ్మ సామాజిక వ‌ర్గం క‌నుస‌న్న‌ల్లో ప‌నిచేశార‌నే ముద్ర వేసుకున్నారు.

దీంతో కాపులు క‌న్నానున‌మ్మే ప‌రిస్థితి లేకుండా పోయింది. ఇక‌, ఇప్పుడు సోము వీర్రాజు పార్టీ ప‌గ్గాలు చేప‌ట్టి న త‌ర్వాత‌.. చాన్నాళ్ల‌కు కాపు సామాజిక వ‌ర్గం వైపు దృష్టి పెట్టారు. దీనికి ప్ర‌ధాన కార‌ణం.. కాపులు రాజ‌కీయంగా ఒక భారీ శూన్య ప‌రిస్థితిని ఎదుర్కొంటుండ‌డ‌మే. దీంతో ఆయ‌న తాజాగా తూర్పుగోదావ‌రి జిల్లాకు చెందిన కాపు ఉద్య‌మ‌నాయ‌కుడు ముద్ర‌గ‌డ‌ను క‌ల‌వ‌డం, పార్టీలోకి ఆయ‌న‌ను ఆహ్వానించ‌డం తెలిసిందే. ముద్ర‌గ‌డ బీజేపీ తీర్థం పుచ్చుకుంటే .. ఖ‌చ్చితంగా కాపు సామాజిక వ ర్గంలో క‌ద‌లిక వ‌స్తుంద‌నే ఆశ‌లు క‌నిపిస్తున్నాయి.

అయితే.. ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం బీజేపీలోకి వ‌చ్చేందుకు ప్ర‌ధానంగా అడ్డంకిగా మారిన విష‌యం రిజ‌ర్వే ష‌న్‌. ఈ విష‌యంలో బీజేపీ కేంద్రం పెద్దల నుంచి ఆయ‌న‌కు స్ప‌ష్ట‌మైన హామీ క‌నుక వ‌స్తే.. ఖ‌చ్చితంగా ఆయ‌న పార్టీ లోకి వ‌చ్చే సూచ‌న‌లు క‌నిపిస్తున్నాయి. కానీ, సోముకు అంత సీన్ ఉందా?  కాపుల‌కు రిజ‌ర్వే ష‌న్‌ల విష‌యంలో కేంద్రం పెద్ద‌ల వ‌ద్ద ఆయ‌న చ‌ర్చించి.. కాపుల‌కు అన‌కూలంగా నిర్ణ‌యం తీసుకునే అవ‌కాశం ఉందా? అనేది ప్ర‌ధాన ప్ర‌శ్న‌. ఇప్పుడున్న ప‌రిస్థితిలో ఈ డిమాండ్ నెర‌వేరే ప‌రిస్థితి క‌నిపించ డం లేదు. అయితే.. బీజేపీ వైపు మొగ్గు చూపితే.. త‌మ‌కంటూ ఓ స్టాండ్ ల‌భిస్తుంద‌నేది కాపుల మ‌ధ్య చ‌ర్చ‌లో వినిపిస్తోంది. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: