కళా వెంకట్రావ్ అరెస్ట్ తో జగనోరు పై పెరిగిపోతున్న వ్యతిరేకత..?
ఈ నేపథ్యంలో వారి బలహీనతను బలపరుస్తూ జగన్ చేసిన ఓ చర్య ఇప్పుడు వారిని మరింత బలహీనపరిచింది. అదే కల వెంకట్రావ్ అరెస్ట్.. కళా వెంకట్రావు సౌమ్యుడు, ఏనాడూ వివాదాల జోలికి వెళ్లేవాడు కాడు అని ఆయన ఆరోపించారు. 5 సార్లు శాసన సభ్యునిగా, రాజ్యసభ సభ్యునిగా, టిటిడి ఛైర్మన్ గా, 4 శాఖలకు (హోంశాఖ, పురపాలక, వాణిజ్య పన్నుల, ఇంధన శాఖ) మంత్రిగా 38 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న నాయకుడిని అరెస్ట్ చేయడం పట్ల సర్వత్రా విమర్శలు ఎదుర్కొంటున్నాడు జగన్.. ఈ నేపథ్యంలో చంద్రబాబు జగన్ ప్రభుత్వ వైఖరి ని ఎండగట్టారు.
జగన్ రెడ్డి పిచ్చి ముదిరి పోయిందని, రాష్ట్రంలో పిచ్చోడి పాలన సాగుతోంది అని చంద్రబాబు అన్నారు. జగన్ రెడ్డికి అధికారం పిచ్చోడి చేతికి రాయిలా మారింది అని ఆయన ఆరోపించారు. దానితో కనబడ్డ వాళ్లందరి తలలు పగులగొట్టడమే పనిగా పెట్టుకున్నారు అన్నారు.జగన్ రెడ్డి సైకో చేష్టలకు పరాకాష్ట. బిసి నాయకత్వాన్ని అణగదొక్కడమే జగన్ రెడ్డి లక్ష్యం అని మండిపడ్డారు. అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఒక పథకం ప్రకారం బిసి సామాజికవర్గం పై కక్ష తీర్చుకుంటున్నారు అని ఆరోపించారు. వైసిపి రాక్షస కాండను ప్రశ్నిస్తే అరెస్ట్ చేస్తారా..? అని నిలదీశారు. నాతో సహా టిడిపి నేతల రామతీర్ధం పర్యటనకు ప్రభుత్వం అనుమతించింది అన్నారు. పోలీసులే నేను వెళ్లే గంట ముందు విజయసాయి రెడ్డి పర్యటనకు ఎందుకు అనుమతించారు అని నిలదీశారు.?