బాబోయ్.. చైనా మరోసారి ప్రపంచాన్ని ముంచేయబోతోందా..?

Chakravarthi Kalyan
చైనా.. మన పొరుగున ఉన్న ఈ దేశం.. మరోసారి ప్రపంచాన్ని ముంచేసే ప్రమాదం కనిపిస్తోంది. గతంలో వుహాన్‌లో కరోనా వైరస్ వ్యాపించిన సమయంలో చైనా ఉద్దేశపూర్వకంగా ప్రపంచాన్ని తప్పుదోవ పట్టించింది. కరోనా వైరస్‌ ఎంత భయంకరమైందో తెలిసినా.. ప్రపంచానికి ఆ సమాచారం అందించలేదు. తన దేశంలో కరోనా విజృంభిస్తున్నా విదేశాలకు రాకపోకలు నిలిపేయలేదు. తన దేశస్తులు దేశం దాటకుండా కట్టడి విధించలేదు.
ఆనాటి చైనా నిర్లక్ష్యం ఏకంగా ప్రంపంచంలోని 190 దేశాలకు శాపంగా మారింది. కరోనా వైరస్ చైనా నుంచి ప్రపంచం మొత్తం విస్తరించింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కుదేలు చేసింది. లక్షల మంది మరణాలకు కారణమైంది. కోట్ల మంది జీవితాలను నడిరోడ్డున పడేసింది. అయితే ఇప్పడు మరోసారి చైనా కారణంగా ప్రపంచం ఇబ్బంది పడబోతోందా..అంటే అవునంటున్నారు నిపుణులు. ఎందుకంటే.. ఇప్పుడు మరోసారి చైనాలో కరోనా వైరస్ విజృంభిస్తోంది.
చైనాలో మళ్లీ కరోనా కోరలు చాస్తోంది. రోజూ వందల్లో కొత్త కేసులు నమోదవుతున్నాయి. చైనా అధికారికంగానే ఈ లెక్కలు చెబుతోంది. ఇక చైనా చెప్పకుండా దాచిన కేసులు వేలల్లోనే ఉంటాయి. మొన్నటి వరకూ నూతన సంవత్సర వేడుకలు సైతం చేసుకున్న చైనా.. ఇప్పుడు ఏకంగా 11 ప్రాంతాల్లో లాక్‌ డౌన్ విధించిందంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
అయినా సరే.. చైనా తన దేశంలో ప్రబలుతున్న చైనా వైరస్ గురించి చెప్పడం లేదు. కొత్తగా విజృంభిస్తున్న కేసులను దాచి పెడుతోంది. కరోనా విజృంభించిన సమయంలో నిర్మించిన ఆసుపత్రులు కాకుండా ఇప్పుడు చైనా మరో కొత్త ఆసుపత్రులను యుద్ధ ప్రాతిపదికన నిర్మిస్తోంది. అంటే అసలు చైనాలో ఏం జరుగుతుంది.. మళ్లీ ఏ ఉపద్రవం ముంచుకొచ్చింది. ఈ ఉపద్రవం చైనాకే పరిమితమా.. మళ్లీ ప్రపంచాన్ని ఇబ్బంది పెడుతుందా అన్నది తేలాల్సి ఉంది. ఇప్పటికైనా ప్రపంచ సంస్థలు చైనాపై కన్నేయాలి.. వాస్తవాలు వెలికి తీయాలి. ప్రపంచాన్ని కాపాడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: