దేవినేని ఉమా దీక్ష.. మరోసారి ఘాటు విమర్శలు చేసిన కొడాలి నాని
అయితే పోలీసులు ఆయనను అడ్డుకుని వెంటనే అదుపులోకి తీసుకున్నారు. ఇక ఈ ఘటనపై వెంటనే మంత్రి కొడాలి నాని స్పందించారు. దీక్షకు పోలీసులు ఒప్పుకోరని దేవినేని ఉమాకు ముందే తెలుసుని.. అన్నీ తెలిసే దీక్షా నాటకం ఆడాడంటూ కొడాలి నాని మండిపడ్డారు. దేవినేని ఉమాకు దమ్ము, ధైర్యం ఉంటే బహిరంగ చర్చకు రావాలంటూ సవాల్ విసిరారు. మీడియా సమక్షంలోనే ఇరువురి మేనిఫెస్టో గురించి చర్చిద్దామని, ఏ పార్టీ చెప్పిన హామీలను నెరవేర్చిందో చూద్దామంటూ కొడాలి నేని చెప్పుకొచ్చారు.
అక్కడే కొట్టకపోతే తాను రాష్ట్రం విడిచి వెళ్లిపోతానన్నారు. సొల్లు ఉమా సొల్లు కబుర్లు చెబుతాడంటూ ధ్వజమెత్తారు. బహిరంగ చర్చకు సిద్దమా అని అడిగేందుకు రాత్రి నుంచి దేవినేని ఉమాకు పది సార్లు ఫోన్ చేశానని కొడాలి నాని చెప్పారు. కాగా.. దేవినేని ఉమాను పోలీసులు అదుపులోకి తీసుకున్న వెంటనే వైసీపీ నేతలు ఎన్టీఆర్ విగ్రహానికి క్షీరాభిషేకం చేశారు. వైసీపీ ప్రభుత్వానికి ఎందుకింత భయమంటూ దేవినేని ఉమా ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను దీక్ష చేయకూడదా.. తనను చంపేస్తారా అంటూ పోలీసులపై మండిపడ్డారు. మరోపక్క దేవినేని ఉమాను అరెస్ట్ చేయడం పట్ల టీడీపీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.