ఏపీలో అద్వానీ వారసుడు ?

Satya
బీజేపీకి రాముడుకు మంచి అనుబంధం ఉంది. అలాగే బీజేపీకీ రధ యాత్రలకు కూడా మంచి లింక్ ఉంది. అయోధ్య రాముడి కోసం 1990 లలో అద్వానీ జరిపిన రాధ యాత్ర నాటి దేశ రాజకీయాలనే సమూలంగా మార్చివేసింది. ఇపుడు ఏపీలో కూడా బీజేపీ అదే ఫార్ములా వాడబోతోంది.
మరి బీజేపీ రధ యాత్రకు సారధి ఎవరు ఉంటారు అన్నది అతి పెద్ద చర్చగా ఉంది. తిరుపతి కపిల తీర్ధం నుంచి విజయనగరం జిల్లా రామతీర్ధం వరకూ రధ యాత్ర అంటూ ప్రకటించడం వరకూ బాగానే ఉన్నా వారం రోజుల పాటు సాగే ఈ రధ యాత్రను ఎవరు చేపడుతారు అన్నదే ఇక్కడ చర్చ.
బీజేపీకి ఏపీ ప్రెసిడెంట్ గా ఉన్న సోము వీర్రాజు సహజంగా రధ యాత్రకు సారధి అని వినిపిస్తోంది. ఆయన రధ యాత్ర పేరిట ఏపీ నాలుగు చెరగుల తిరగడం అన్నది కచ్చితంగా జరిగితే మాత్రం బీజేపీలో ఆయన ప్లేస్ ని మార్చే వారు ఎవరూ ఉండరు సరి కదా ఆయన బలమైన నేతగా ఆవిర్భవిస్తారు.
అయితే రధ యాత్ర సూపర్ హిట్ అయితేనే ఇదంతా జరిగేది. రధ యాత్ర అంటే ఆషామాషీ వ్యవహారం కాదు, ఎక్కడికక్కడ వివిధ ప్రాంతాలలో ఉన్న జనాలను ఉద్దేశించి మాట్లాడాలి. వారి సమస్యలు ప్రస్తావించాలి. ఒక విధంగా అనర్గళంగా మాట్లాడుతూ జనాలను ఆకట్టుకోవాలి. మరి బీజేపీలో రధ సారధి ఎవరు అన్నది ఇపుడు పెద్ద ప్రశ్నగా ఉందిట.
సోము వీర్రాజు మీడియా సమావేశాల వరకూ బాగానే మాట్లాడుతారు. అయితే ఆయన ఇంత పెద్ద ప్రొగ్రాం ఎపుడూ టేకప్ చేయలేదు. ఆయన సారధి కాబట్టి ఆయనే రధాన్ని ఎక్కితే ఎలా ఉంటుంది రియాక్షన్ అన్న చర్చ కూడా ఉంది. ఆయన కాకపోతే మంచి వాగ్దాటి కలిగిన  వారు ఆ పార్టీలో ఇంకా ఎవరు ఉన్నారు అన్నది కూడా చర్చగా ఉందిట. అయితే ఏపీ బీజేపీ ప్రెసిడెంట్ గా ఉన్న సోము వీర్రాజుని కాదని ఎవరూ ముందుకు రారు అంటున్నారు. మరి నాటి అద్వానీని మరపించేలా సోము రధాన్ని ముందుకు దూకుడుగా తీసుకుపోగలరా, ఏపీ రాజకీయాలను మార్చగలరా. చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: