వామ్మో.. పోలీసులే వీడి ఆదాయాన్ని చూసి షాక్ అయ్యారు..

Satvika
డబ్బులు కోసం ఒక్కొక్కరు ఒక్కో అవతారాన్ని ఎత్తుతున్నారు. కొన్ని మంచిగా ఉంటే మరీ కొన్ని మాత్రం చూసిన వాళ్ళను ఔరా అనిపించే రీతిలో ఉన్నాయి. ఇప్పుడు కూడా ఓ యువకుడి ఆదాయం చూసి పోలీసులు సైతం షాక్ అవుతున్నారు. మద్యం నిషేదం ఉన్న ప్రాంతాల్లో మద్యం అమ్మకాలు జోరుగా సాగించాడు. దాంతో కుప్పలు తెప్పలుగా డబ్బులు వచ్చి పడ్డాయి. ఈ విషయం ప్రస్తుతం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. 



వివరాల్లోకి వెళితే.. బీహార్ లోని ఓ ఎంబీఏ విద్యార్థి ఒక వైపు చదువుకుంటూ మరో వైపు నిషేధించిన మద్యాన్ని అమ్ముతూ లాభాలను ఆర్జిస్తున్నాడు. లగ్జరీ జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ,ఎక్సైజ్ అధికారులు అతని ఇంటి పై దాడి చేశారు.రూ.21 లక్షల విలువైన 1,100 లీటర్ల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు అతుల్ సింగ్ రోజుకు రూ.9 లక్షల విలువైన అక్రమ మద్యాన్ని విక్రయిస్తున్నట్టు పత్రకార్ ‌నగర్ పోలీస్ స్టేషన్ అధికారి మనోరంజన్ భారతి తెలిపారు. అతడి వద్ద నుంచి బ్యాంకు పాస్ ‌బుక్‌ తో పాటు సంబంధిత పత్రాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.



పోలీసుల విచారణలో అతను నమ్మలేని నిజాలను బయట పెట్టారు.. నిరుద్యోగ యువత ద్వారా నగరంలోని అన్ని ప్రాంతాలకు మద్యాన్ని సరఫరా చేస్తున్నట్టు తెలిపారు. 30 నుంచి 40 మంది ద్వారా కస్టమర్లకు డోర్ డెలివరీ చేస్తున్నట్టు పేర్కొన్నాడు. అతుల్ సహచరులు ఇంద్రజిత్ సింగ్, సంజీవ్ కుమార్‌లను అరెస్ట్ చేయడం తో అతడి భాగోతం బయటపడింది. నోయిడా లోని ప్రముఖ యూనివర్సిటీ లో ఎంబీఏ చదువుతున్నట్టు ఐడీ కార్డ్ చూపించి, పోలీసులను తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నించాడు. అయితే, పోలీసులు తగిన రుజువులు చూపడం తో మద్యం విక్రయిస్తున్నట్టు ఒప్పుకున్నాడు.. అతని ఆదాయం ఏకంగా లక్షల్లో ఉండటం తో పోలీసులు షాక్ లో ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: