భారత అమ్ముల పొదిలో..!
భారత వైమానిక దళాన్ని తిరుగులేని శక్తిగా తీర్చిదిద్దేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని భద్రతా వ్యవహారాల కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. మన వాయుసేనను బలోపేతం చేయడమే లక్ష్యంగా 48వేల కోట్లతో 83 తేజస్ ఫైటర్ జెట్ల కొనుగోలుకు ఆమోద ముద్రవేసింది. అత్యాధునిక సాంకేతికతతో కూడిన ఈ ఫైటర్ జెట్ల కొనుగోలుతో మన వాయిసేన మరింత బలంగా మారనుంది.
తేజస్ ఫైటర్ జెట్ల కొనుగోలు నిర్ణయం దేశ రక్షణ రంగం స్వయం సమృద్ధికి దోహదం చేస్తుందని కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. రానున్న రోజుల్లో ఈ ఫైటర్ జెట్లు భారత వాయుసేనను మరింత పటిష్టం చేయనున్నాయని తెలిపారు. ఆత్మనిర్భర్ భారత్లో భాగంగా స్వదేశీ కంపెనీలకు ప్రాధాన్యం ఇవ్వాలనే ఉద్దేశంతో ప్రధాని చారిత్రక నిర్ణయం తీసుకున్నారని రాజ్నాథ్ ప్రశంసించారు.
మొత్తం జెట్లలో... 73 తేజస్ ఎంకే-1ఏ ఫైటర్ జెట్లు, 10 తేజస్ ఎంకే-1ఏ శిక్షణా జెట్లు ఉండనున్నాయి. ఈ జెట్లలో పెద్ద సంఖ్యలో అధునాతన సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించనున్నారు. తేజస్ విమానాలను హిందుస్థాన్ ఏరోనాటికల్ సంస్థ తయారు చేస్తోంది.
మొత్తానికి భారత వైమానిక దళం మరింత శక్తిమంతం కానుంది. భారత అమ్ముల పొదిలో పైటర్ జెట్ లు చేరబోతున్నాయి. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 83తేజస్ ఫైటర్ జెట్ లు కొనుగోలుకు గ్రీన్ సిగ్నల్ లభించింది. 43వేల కోట్ల వ్యయంతో కొనుగోలు చేసేందుకు భారత రక్షణ శాఖ ఒప్పందం కుదుర్చుకుంది. అత్యాధునిక సాంకేతికతతో ఫైటర్ జెట్స్ రానున్నాయి.