వీళ్లకి మాత్రం వ్యాక్సిన్ ఇవ్వొద్దు.. డబ్ల్యూహెచ్వో కీలక సూచనలు..?
అయితే ఇప్పటికే రెండు వాక్సిన్ లకు అత్యవసర వినియోగానికి అనుమతి ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. ఇక వ్యాక్సిన్ డోసులు ప్రతి ఒకరికి అందే విధంగా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు దిశానిర్ధేశం కూడా చేసింది. ఈ క్రమంలోనే మరికొన్ని రోజుల్లో ఎంతో ప్రతిష్టాత్మకంగా వ్యాక్సినేషన్ ప్రక్రియను ప్రారంభించేందుకు సిద్ధమయింది కేంద్ర ప్రభుత్వం. అయితే.. ఇక వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిన తర్వాత ముందుగా కరోనా వారియర్స్ కి వ్యాక్సిన్ అందజేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించాయి అన్న విషయం తెలిసిందే.
ఇకపోతే ఈ నెల 16వ తేదీ నుంచి భారత్ లో వాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఇలాంటి పరిణామాల నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ కీలక సూచనలు చేసింది. తీవ్రమైన అలర్జీ ఉన్నవారు, గర్భిణీలు, పాలిచ్చే బాలింతలు, 16 ఏళ్ల లోపు పిల్లలు వాక్సినేషన్ ప్రక్రియకు దూరంగా ఉండటం ఎంతో మంచిది అంటూ సూచించింది. ఇక టీకా తీసుకున్న మహిళలు రెండు మూడు నెలల వరకు గర్భధారణకు దూరంగా ఉండాలి అని డబ్ల్యుహెచ్వో సూచించింది. ట్రయల్స్ లో హెచ్ఐవి బాధితులకు సంబంధించిన డేటా పరిమితంగా ఉందని.. ఈ విషయాన్ని ముందుగానే హెచ్ఐవి బాధితులకు తెలపాలని డబ్ల్యుహెచ్వో తెలిపింది. తగిన జాగ్రత్తల మధ్య వ్యాక్సినేషన్ ప్రక్రియను జరపాలని సూచించింది ప్రపంచ ఆరోగ్య సంస్థ.