నిమ్మగడ్డ ప్రెస్‌నోట్‌లో ఆ ఒక్క వాక్యం..? వామ్మో.. మామూలోడు కాదు..!?
అయితే జగన్ సర్కారుకు ఉద్యోగులు అండగా నిలిచారు. ఎన్నికలు బహిష్కరిస్తామంటున్నారు. ఈ మేరకు వాళ్లు మీడియా ముందు కూడా మాట్లాడారు.. తాజాగా ఇప్పుడు నిమ్మగడ్డ ఉద్యోగులకు బిస్కట్లు వేస్తూ.. ఓ ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. ఏపీ ఉద్యోగులకు ఎవరూ సాటిలేరని, ప్రకృతి వైపరీత్యాల సమయంలో ఎంతో కష్టపడి పని చేసిన గుర్తింపు ఏపీ ఉద్యోగులకు ఉందని, ఇప్పుడు కూడా అదే సంకల్పంతో పని చేయాలని పిలుపునిచ్చారు.
పోలింగ్ సిబ్బంది భద్రతకు పూర్తి చర్యలు తీసుకుంటామని నిమ్మగడ్డ అంటున్నారు. పోలింగ్ సిబ్బంది కరోనా బారిన పడకుండా చర్యలు తీసుకుంటామంటున్నారు. కరోనా టీకాలో పోలింగ్ సిబ్బందికి ప్రాధాన్యత ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరినట్లు ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ తెలిపారు. పోలింగ్ సిబ్బందికి పీపీఈ కిట్లు, ఫేస్‌షీల్డ్‌లు సరఫరా చేస్తామన్నారు. అన్ని రాష్ట్రాల్లో పంచాయతీ ఎన్నికలు జరిగాయని గుర్తు చేశారు.
అయితే ఇదంతా బాగానే ఉన్నా.. ఆయన లేఖలో ఒక్క వాక్యం మాత్రం చాలా ఇంట్రస్టింగ్‌గా ఉంది. ఉద్యోగుల రక్షణ కోసం ఎన్నికల కమిషన్ మార్గదర్శకత్వంలో రాష్ట్రప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని తెలిపారు. అంటే ఈ గవర్నమెంట్ నేను చెప్పినట్టు నడవాల్సిందే సుమా.. వాళ్లకు వేరే ఆప్షన్ లేదని నిమ్మగడ్డ చెప్పకనే చెప్పారని నిపుణులు కామెంట్ చేస్తున్నారు. మరి ఆయన ఏ ధైర్యంతో అలా రాశారో తెలియదు కానీ.. మొత్తానికి నిమ్మగడ్డ ఇంకా తన వంతు పోరాటం మాత్రం చేస్తూనే ఉన్నారు. మరి యుద్ధం ఎలా ముగుస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.