ఆడాళ్లంటే చిన్నచూపా.. వీళ్ల కథ చదవి సిగ్గుపడండి.. రియల్లీ గ్రేట్..!?

Chakravarthi Kalyan
సమాజం ఎంతగా మారిందని చెప్పుకుంటున్నా..ఇంకా ఆడపిల్ల అంటే మన సమాజంలో వివక్ష కొనసాగుతూనే ఉంది. అమ్మాయి పుట్టిందని తెలిస్తే బాధపడే తల్లిదండ్రులకు కొదవు లేదు.. అందుకే ఎవరైనా ప్రసవం జరగగానే.. తల్లీ బిడ్డా బావున్నారా.. అని అడగడం మాని.. అబ్బాయా.. అమ్మాయా.. అంటూ అడుగుతారు.. కానీ ఇప్పుడు సీన్ మారుతోంది.. అమ్మాయిలు అన్ని రంగాల్లోనూ రాణిస్తున్నారు.

చివరకు సైన్యం వంటి వాటిలోనూ దూసుకుపోతున్నారు. అలాంటి ఓ మహిళా విజయ గాధే ఇది. తాజాగా శాన్‌ఫ్రాన్సిస్‌కో నుంచి బెంగళూరుకు ప్రయాణిస్తున్న ఎయిర్ ఇండియా వాణిజ్య విమానాన్ని అంతా ఆడవాళ్లే నడిపి శభాష్ అనిపించుకుంటున్నారు. నిన్న రాత్రి 8 గంటలకు బయలు దేరిన ఈ విమానం కాక్‌పిట్‌లో అంతా ఆడవాళ్లే.. ఈ విమానం పైలెట్లుగా కెప్టెన్ జోయా, కెప్టెన్ తన్మయి, కెప్టెన్ శివాని, కెప్టెన్ ఆకాంక్ష చరిత్ర సృష్టించారు. ఉత్తరధ్రువం మీదుగా అట్లాంటిక్‌ను దాటుకొని ఈ విమానం బెంగళూరుకు రాబోతోంది.

అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్‌కో నుంచి బెంగళూరుకు నాన్‌ స్టాప్‌గా 17 గంటలు ప్రయాణం జరగాల్సిఉంది. ఈ నాన్‌ స్టాప్‌ తొలి తొలి వాణిజ్య విమానాన్ని  భారత మహిళా పైలెట్లే నడపుతున్నారు. శాన్‌ఫ్రాన్సిస్‌కో- బెంగళూరు మధ్య ప్రయాణ సమయం 17 గంటలపైనే. ఈ నగరాల మధ్య దూరం 13 వేల 993 కిలోమీటర్లు. ఈ విమానాన్ని నడిపే వారందరూ మహిళలేనని కేంద్ర మంత్రి కూడా గర్వంగా ప్రకటించారు. ఈ విమానం కాక్‌పిట్‌లో అందరూ మహిళలే ఉంటారంటూ విమానయాన మంత్రి హర్‌దీప్‌సింగ్ పూరీ సోషల్ మీడియాలో పోస్టు చేశారు.

ఈ విమానాన్ని కెప్టెన్ జోయా అగర్వాల్‌, కెప్టెన్ పాపగారి తన్మయి, కెప్టెన్ ఆకాంక్ష సోనావర్, కెప్టెన్ శివాని మాన్‌హాస్ నడుపుతున్నారు. ఇప్పటికే శాన్‌ ఫ్రాన్సిస్కో లో బయలు దేరిన ఈ విమానం ఇండియన్ కాలమానం ప్రకారం సోమవారం తెల్లవారుజామున దిగుతుంది. బెంగళూరు కెంపెగౌడ విమానాశ్రయంలో ల్యాండ్ అవుతుంది. మరో రికార్డు ఏంటంటే. ప్రపంచంలోనే ఇండియా నడుపుతున్న  అత్యంత దూర వాణిజ్య విమానం ఇదేనట. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: