రైతుల ఉద్యమం ఓ కొలిక్కి రాలేదా..ఎవరు తగ్గట్లేదే..?

P.Nishanth Kumar
దేశ రాజధాని ఢిల్లీ లో రైతుల ఉద్యమం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఎముకలు కొరికే చలిలో సైతం రైతులు ప్రాణాలకు లెక్క చేయకుండా రైతుల ప్రయోజనం కొరకు పోరాడుతూనే ఉన్నారు. ఇటీవలే దేశ ప్రధాని మోడీ పార్లమెంట్ లో ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లుకి వ్యతిరేకంగా పంజాబీ, బిహారి రైతులు ఢిల్లీ లో నడిరోడ్డుపై బైఠాయించి ఉద్యమం చేపట్టారు. అయితే మధ్య మధ్య లో ప్రభుత్వం రైతులతో చర్చలకు దిగినా ఎవరు కూడా ప్రభుత్వం చెప్పేది వినలేదు..

వ్యవసాయ చట్టాన్ని రద్దు చేయడమే లక్ష్యంగా రైతులు ఉద్యమం అని ముందు చెప్పినట్లుగా నే ఇప్పటికీ ఉద్యమాన్ని కొనసాగిస్తున్నారు. చట్టంలో ఎన్ని సవరింపులు చేసినా రద్దు చేస్తే దీక్ష మానేది అని రైతులు ప్రాణాలకు తెగించి ఉద్యమాన్ని చేస్తున్నారు. పలు రైతు సంఘాలు కూడా ఈ ఉద్యమానికి మద్దతు పలకగా, అనేక బీజేపీయేతర ప్రభుత్వాలు ఇప్పటికే రైతులను కలిసి చర్చించాయి. తమ మద్దతు పూర్తిగా మీకే అని ప్రకటించాయి.

వివాదాస్పద సాగు చట్టాలపై కేంద్ర మంత్రులు, రైతు సంఘాల ప్రతినిధుల మధ్య శుక్రవారం జరిగిన చర్చలు ఎలాంటి పరిష్కారానికి నోచుకోలేదు. రైతులు ఎట్టి ప‌రిస్థితుల్లోనూ వెన‌క్కి త‌గ్గేందుకు ఒప్పుకోవ‌డం లేదు. ప్ర‌భుత్వం స‌వ‌ర‌ణ‌లు మిన‌హా.. చ‌ట్టాల ర‌ద్దుకు స‌సేమిరా అంటోంది. ఎనిమిదో సారి జ‌రిగిన చ‌ర్చ‌లు కూడా కొలిక్కి రాలేదు. ఈనెల 15న మరోసారి సమావేశం కావాలని మాత్రం నిర్ణయించారు. విజ్ఞాన్ భవన్‌లో సుమారు గంటసేపు చర్చలు జరిగినప్పటికీ ఇరువర్గాలు తమ వాదనకే కట్టుబడ్డాయి. సాగు చట్టాలను రద్దు చేయాలని రైతు ప్రతినిధులు ప్రభుత్వానికి మరోసారి విజ్ఞప్తి చేశారు. చట్టాలను వెనక్కితీసుకుంటేనే తాము నిరసనలకు స్వస్తి చెప్పి ఇళ్లకు వెళ్తామని చెప్పారు. మరోవైపు, ప్రభుత్వం కూడా తమ వైఖరి మరోమారు స్పష్టం చేసింది. వివాదాస్పద క్లాజులకే చర్చలు పరిమితం చేద్దామని, చట్టాలను పూర్తిగా వెనక్కి తీసుకునేది లేదని తెగేసి చెప్పింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: