విమానంలో సీట్లన్నీ ఒక్కడే బుక్ చేసుకున్నాడు...తరువాత ఏమైందో తెలుసా...?
వివరాల్లోకి వెళితే ఇండోనేసియా దేశంలోని జకార్తాకు చెందిన రిచర్డ్ ముల్ జాదీ తన భార్య షల్విన్నీ ఛాంగ్ ని తీసుకుని పర్యాటకంలో భాగంగా బాలీ కి వెళ్లారు. అయితే అక్కడ తన భార్యను వదిలి తాను తిరిగి వచ్చే క్రమంలో ఓ వింత ఆలోచన ఇప్పుడు అతనిని సెలెబ్రిటీని చేసింది. విమానంలో వెళ్ళాలి కాబట్టి..అందరూ ఉంటారని, తద్వారా తనకు కరోనా వైరస్ వ్యాపిస్తుందని అలోచించి, ఏకంగా తను వెళ్లాల్సిన లయన్ ఎయిర్ లైన్స్ కు చెందిన బాటిక్ ఎయిర్ ఫ్లైట్ లో ఉన్న సీట్లు అన్నింటినీ ఒక్కడే కొనేశాడు. ఇక విమానంలో ఉంది ఒక్కడే కాబట్టి. పైలట్ తో సంబంధం లేదు కాబట్టి..ధైర్యంగా విమానంలో కూర్చున్నాడు.
కూర్చున్న వాడు సైలెంటుగా ఉండకుండా, తను ఫ్లైట్ లో సెల్ఫీ తీసుకుని, సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అంతే కాకుండా ప్రైవేట్ జెట్ కంటే కూడా ఇది చాలా చవకని, అన్ని సీట్్స బుక్ చేసుకున్నా సరే...చాలా తక్కువ ఖర్చు మాత్రమే అయిందని రిచర్డ్ తెలపడం విశేషం. ఇప్పుడు ఈ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది...! అయితే ఇతని ఐడియా మాత్రం అదిరింది. అయితేేే అతను డబ్బు ఉన్నవాడు కాబట్టి అలా చేయగలిగాడు సామాన్యుల పరిస్థితి ఏమిటో మీరే ఆలోచించండిి.