జగన్ కి ఆ టెన్షన్ అయితే మొదలైందట..?
అవినీతి పరుల తాట ఓలచడం కూడా ప్రజల్లో మంచి పేరు ను సంపాదించి పెడుతుంది.. ఇదే సమయంలో టీడీపీ దిగజారిపోతుంది. అన్ని నియోజకవర్గాలు అని చెప్పలేం కానీ దాదాపు ఓ యాభై నియోజకవర్గాల్లో టీడీపీ భవిష్యత్ లో కోలుకోకుండా చేశాడు జగన్.. అయితే ఎప్పటినుంచో బలంగా ఉన్న టీడీపీ ఒక్కసారి ఓడిపోతే ఇలాంటి పరిస్థితి వస్తుందని ఎవరు ఊహించి ఉండరు. ఇటీవలే పార్లమెంట్ ఇంచార్జి లను నియమించిన చంద్రబాబు కు ఆయా ప్రాంతాల్లో లీడర్ ల నియామకం చేపట్టినప్పుడు ఈ ఏరియా ల్లో ఇంత వీక్ గా పార్టీ ఉందని ఓ అంచనాకి వచ్చారు.
జగన్ సీఎం అయ్యాక చేయాల్సినవి చాలానే ఉన్నాయనుకున్నారు. కానీ ఆచరణకు వచ్చేసరికి మాత్రం ఆయనకు అనేక అడ్డంకులు ఎదురవుతున్నాయి. కోర్టు కేసులను ప్రతిపక్షాలు వేసి మరీ కధ ముందుకు సాగకుండా చేస్తున్నారు. అంతే కాదు కొన్ని కీలక నిర్ణయాలలో జగన్ ఏమీ కాని వానిగా జనం ముందు నిలబడాల్సివస్తోంది. ఇంకో వైపు చూస్తే ఏపీకి ఆదాయం అంతంతమాత్రంగా ఉంది. కరోనా కూడా పడగ విప్పి ఒక క్యాలండర్ ఇయర్ ని మింగేసింది. ఇంకో వైపు జమిలి ఎన్నికలు అంటున్నారు. దాంతో జగన్ అభివృద్ధి విషయంలో ఏమీ చేయకుండానే ఎన్నికలకు వెళ్తానా అన్న టెన్షన్ లో ఉన్నట్లుగా ప్రచారం అయితే ఉంది.