శ్రీలంకకి వెళ్లిన జై శంకర్.. చైనాలో మొదలైన టెన్షన్..?
ఈ క్రమంలోనే ఇప్పటికే భారత్ చుట్టూ ఉన్న దేశాలతో వరుసగా సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు భారత విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్. ఈ క్రమంలోనే కీలక చర్చలు జరుపుతూ ఆయా దేశాలతో సత్సంబంధాలు కొనసాగిస్తున్నది. ఈ క్రమంలోనే భారత విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ వరుసగా సమావేశాలు నిర్వహిస్తూ ఒక పటిష్టమైన లాబీ ఏర్పాటు చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు అని అంటున్నారు విశ్లేషకులు. ఓవైపు ఆర్మీ అధికారులు మరోవైపు భారత భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ఇంకోవైపు విదేశాంగ శాఖ జయశంకర్ భారత్ చుట్టూ ఉన్న దేశాల్లో పర్యటించి చైనా వ్యవహారాలు రాబోయే రోజుల్లో ఎలా ఉంటాయో చెప్పడమే కాదు ఇక ఆ తర్వాత జరగబోయే కార్యకలాపాలు ఎలా ఉండాలి అన్నదానిపై కూడా చర్చలు జరుపుతున్నారు.
ప్రస్తుతం ఆయా దేశాలతో వాణిజ్య పరమైన రక్షణ పరమైన సంబంధాలను కూడా ఎప్పటికప్పుడు మెరుగు పరుచుకుంటూ ముందుకు సాగుతోంది భారత్. ఈ క్రమంలోనే ఇటీవల భారత విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ శ్రీలంకకు వెళ్లారు. అక్కడ చైనా వేరే దేశాల పట్ల అనుసరిస్తున్న విధానాలను కళ్లకు కట్టినట్లు చూపించి స్నేహాన్ని మరింత మెరుగుపరుచుకునేందుకు చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది