షాకింగ్ : కరోనా వ్యాక్సిన్‌ వేయించకుంటే.. మగతనం పోతుందా..?

Chakravarthi Kalyan
మొత్తానికి ఇండియాకు కూడా కరోనా వ్యాక్సీన్ వచ్చేసింది. హైదరాబాద్‌ సంస్థ భారత్‌ బయోటెక్‌ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్‌ టీకా షరతులతో కూడిన అత్యవసర వినియోగానికి భారత్‌లో ఆమోదం లభించింది. ఐసీఎంఆర్‌, పుణె ఎన్‌ఐవీ సహకారంతో భారత్‌ బయోటెక్‌ కొవాగ్జిన్‌ను రూపొందించింది.  ఆక్స్‌ఫర్డ్‌-ఆస్ట్రాజెనెకా సౌజన్యంతో భారత్‌లో సీరం ఇన్‌స్టిట్యూట్‌ అభివృద్ధి చేసిన కొవిషీల్డ్‌ టీకా అత్యవసర వినియోగానికి కూడా డీసీజీఐ ఆమోదం తెలిపింది.

అయితే టీకా వచ్చిందని ఆనందించేలోపే అనేక వదంతలు వ్యాపిస్తున్నాయి. వాటిలో షాకిచ్చే వార్త.. కరోనా వ్యాక్సిన్ వేయించుకుంటే మగతనం పోతుందనేది.. ఈమాట ఎవరో అంటే పెద్దగా పట్టించుకోవాల్సిన పని లేదు. కానీ.. యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ అంటున్నారు. డీసీజీఐ అనుమతి ఇచ్చిన టీకాలను బీజేపీ టీకాలంటున్నాడు అఖిలేశ్‌ యాదవ్‌. ఈ టీకాలు తీసుకుంటే నపుంసకులుగా మారే అవకాశముందని సంచలన వ్యాఖ్యలు చేశారు.

అయితే ఇలాంటి వ్యాఖ్యలను డీసీజీఐ కొట్టిపారేస్తోంది. దీనిపై స్పందించిన భారత ఔషధ నియంత్రణ సంస్థ వ్యాక్సిన్‌ భద్రతపై ఎలాంటి అనుమానాలు అవసరం లేదని స్పష్టం చేసింది. టీకా తీసుకుంటే  నపుంసకత్వం వస్తుందన్న వదంతులు పూర్తిగా అవాస్తవాలని ప్రకటించింది. ఏ మాత్రం అనుమానం ఉన్నా టీకాలకు అనుమతి ఇవ్వమని తెలిపిన డీసీజీఐ వ్యాక్సిన్లు 110 శాతం సురక్షితమని పేర్కొంది. అయితే ఏ టీకా ఇచ్చినా.. జ్వరం, నొప్పి, అలర్జీలు వంటి స్వల్ప లక్షణాలు కనిపించడం సాధారణమేనని వెల్లడించింది.

యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ మాత్రం తన మాటల దాడి ఆపడం లేదు.. వ్యాక్సినేషన్‌ సున్నితమైన ప్రక్రియ అని ప్రభుత్వం దాన్ని సౌందర్య ఉత్పత్తుల కార్యక్రమంలా పరిగణించవద్దని కామెంట్ చేశారు. వ్యాక్సీన్లపై కాంగ్రెస్ నేతలు కూడా తొందర ఎందుకని ప్రశ్నిస్తున్నారు. ముఖ్యంగా టీకా పరీక్షలు పూర్తి కాకముందే.. ఎందుకు అనుమతులు ఇస్తున్నారని నిలదీస్తున్నారు. కానీ.. ప్రభుత్వం మాత్రం అన్ని పరీక్షలు పూర్తయ్యాకే అనుమతులు ఇస్తున్నామని ప్రకటిస్తోంది.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: