తమిళ రాజకీయాల్లో మరో ట్విస్ట్... స్టాలిన్‌కు అళగిరి బిగ్ షాక్...!
ఇక తమిళ రాజకీయాలను దశాబ్దాలుగా శాసిస్తూ వస్తోన్న జయలలిత, కరుణానిధి లేకుండా తొలిసారి జరుగుతోన్న ఎన్నికలు కావడంతో అందరూ ఇప్పుడు వీటి కోసం ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. గత రెండుసార్లు డీఎంకే అధికారానికి దూరం కావడంతో ఈ సారి అయినా ఆ పార్టీకి అధికారం వస్తుందా ? అన్న ఉత్కంఠ ఉండగానే స్టాలిన్‌కు షాక్ ఇస్తూ ఆయన అన్న అళగిరి సంచలన నిర్ణయం తీసుకోనున్నట్టు తెలుస్తోంది. సోదరుడితో విబేధించి పార్టీ నుంచి బయటకొచ్చిన అళగిరి ప్రస్తుతం స్టాలిన్‌ను దెబ్బ కొట్టేందుకు సరికొత్త ప్రణాళికలు రచిస్తున్నట్టు తెలుస్తోంది.
ఈ క్రమంలోనే అళగిరి ఆదివారం భారీ సమావేశం ఏర్పాటు చేస్తున్నారు. తనకు పట్టున్న దక్షిణ తమిళనాడు, మధురై జిల్లాలకు చెందిన నేతలు, తన అనుచరులతో పాటు డీఎంకేలో అసమ్మతి నేతలను కూడా ఈ సమావేశానికి ఆహ్వానిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ సమావేశంలో అళగిరి కొత్త పార్టీ ఏర్పాటుపై ప్రకటన చేస్తారా ? లేదా ఏం జరుగుతుంది ? అన్నదే ఇప్పుడు సస్పెన్స్‌గా ఉంది. కొత్త పార్టీ ఏర్పాటు చేయని పక్షంలో ఆయన బీజేపీకే మద్దతు ఇచ్చే అంశంపై నిర్ణయం తీసుకోవచ్చని తెలుస్తోంది.
ఈ సమావేశంతో డీఎంకే పార్టీ ముఖ్య నేతల్లో ఆందోళన మొదలైంది. పార్టీ నుంచి ఎవరు వీడతారన్న చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. అళగిరి ఏం చేసినా అది స్టాలిన్ ముఖ్యమంత్రి పీఠంపై నీళ్లు చల్లినట్టే అయ్యే అవకాశాలే ఎక్కువుగా ఉన్నాయి. ఆయన గెలిచినా గెలవకపోయినా స్టాలిన్‌ను ఓడించడానికి పనికొస్తాడన్నదే ఇప్పుడు తమిళ పొలిటికల్ టాక్..?