ఈ సంక్రాంతి మొత్తం బ్లాక్ అండ్ వైట్ హవా.. ఎందుకో తెలుసా..?
సాధారణంగా అయితే అప్పటి వరకు ఏ సెలబ్రిటీలు అయితే ఎక్కువగా మీడియాలో హాట్ టాపిక్ గా మారారో ఎక్కువ క్రేజ్ సంపాదించారో ఆ సెలబ్రిటీలతో పండుగ ఈవెంట్ ప్లాన్ చేస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. అయితే గత కొన్ని రోజుల నుంచి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయి అందరినీ ఆకర్షిస్తున్న జంట ఏదైనా ఉంది అంటే అది జబర్దస్త్ కమెడియన్స్ అయినా ఇమన్యుయేల్.. వర్ష అన్న విషయం తెలిసిందే. గతంలో జబర్దస్త్ స్కిట్ లో భాగంగా వీరి మధ్య ఉన్న ప్రేమ వైరల్ గా మారిపోయింది ఎంతో మందిని ఆకర్షించింది.
అయితే ఈ జంటని ప్రస్తుతం సంక్రాంతి ఈవెంట్ లో కూడా హైలెట్గా చూపిస్తున్నారు. ఇక వీరిద్దరిదీ బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ అంటూ రోజా కామెంట్ చేయడంతో ఇక ఈ ఇద్దరి కాంబినేషన్ కాస్త ఎంతో క్రేజ్ సంపాదించింది. ఇక ఇటీవల విడుదలైన సంక్రాంతి ఈవెంట్ కు సంబంధించిన ప్రోమో లో ఇమన్యుయేల్, వర్ష.. చిన్న అల్లుడు చిన్న కూతురు గా ఎంట్రీ ఇస్తారు. అంతే కాకుండా ఒక పాట పై డాన్స్ పర్ఫార్మెన్స్ కూడా చేస్తాడు. ఇక ఈ సందర్భంగా నిజంగా నీ కళ్ళకు ఇమాన్యుయేల్ మన్మధుడు గా కనిపిస్తాడా అంటూ రోజా వర్షను అడగగా అవును అంటూ చెబుతోంది వర్ష.. దీంతో మరోసారి ఈ జంట కాస్త హాట్ టాపిక్ గా మారిపోయింది.