థాయ్ రాజు గారి అసలు కథ ఇది..!
థాయ్ ల్యాండ్ ఒకప్పటి రాజు భూమిబోలియా శ్రీరాముడిలాగే ఏకపత్నీవ్రతుడిగా జీవించాడు. 94 ఏళ్ల వయసులో ఈ మధ్యే చనిపోయాడు. ఆ తర్వాత ఆయన కుమారుడు వజీరాలోంగ్ కోర్న్‌కి పట్టాభిషేకం జరిగింది. భూమి బోలియాకి పూర్తి భిన్నమైనవాడు వజీరా. ఏకంగా నాలుగు పెళ్లిళ్లు చేసుకున్నాడు. నాలుగో పెళ్లి మహా విచిత్రంగా జరిగింది. తన వ్యక్తిగత భద్రతా సిబ్బందిని పర్యవేక్షించే డిప్యూటీ హెడ్‌ను పెళ్లిచేసుకున్నారు. పెళ్లి తర్వాత ఆమెకు క్వీన్ సుతిగగా పేరు పెట్టారు. ఆ తర్వాత రాజమహల్ పగ్గాలు క్వీన్ సుతిగ చేతికే వచ్చాయి.
రాజకుటుంబీకులు అంగీకరించకపోయినా... సుతిగతో అధికారికంగానే అన్నీ నడిపించేవాడు వజీరా. ఈ వ్యవహారం ఇలా నడుస్తుండగానే 2019 జూలైలో సినీసత్‌కు దగ్గరయ్యాడు. నాలుగో భార్య పర్సనల్ సెక్యూరిటీ చూస్తూ ఆయన జీవితంలోకి ప్రవేశిస్తే... ఈ సినీనత్ ఆయనకి నర్సుగా ఉంటూ ఓ మంచి రోజు చూసి పక్కన కూర్చుంది. ఏకంగా రాయల్ నోబుల్ కాన్సార్ట్ బిరుదునిచ్చేశారు. దీనర్థం అధికారికంగా రాజుగారి ఉంపుడుగత్తె అని అర్థం. అయితే ఈ కథ ఇంతటితో అయిపోలేదు. ఏదో ఒక సందర్భంలో నాలుగో పెళ్లాం సుతిగను తిట్టి పోసిందంట సినీసత్. దీంతో జైలుకు వెళ్లాల్సి వచ్చింది.
11 నెలల పాటు ఊచలు లెక్కబెట్టిన సినీసత్.. ఇటీవలే రాజమహల్‌కు వచ్చింది. వచ్చీరావడంతోనే.. ఇలా వార్తల్లోకి ఎక్కింది. ఆమెకు సంబంధించిన నగ్న ఫొటోలు నెట్టింట్లో ప్రత్యక్షమయ్యాయి. పరిపాలన కన్నా.. తను చేసుకున్న పెళ్లిళ్లు.. విడాకులతోనే ఎక్కువ పేరు తెచ్చుకున్న రాజు వజీరా పేరు కూడా మరోసారి మార్మోగుతోంది.
సినీసత్‌ను ఇబ్బంది పెట్టేందుకే.. ఇలా చేసి ఉంటారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ధాయిలాండ్ రాజు మహా వజిరలోంగ్ కోర్న్ 2019లో ఆమెను తన ప్రియురాలిగా ప్రకటించారు. ధాయిలాండ్ సహా ఇతర దేశాల్లో ఆమె పైలట్ ట్రైనింగ్ తీసుకుంది. అలాగే, రాజుకు రాయల్ బాడీగార్డుగా, రాజు గారి గార్డుగా మేజర్ జనరల్ ర్యాంక్ పదవిలో పనిచేసింది. అందుకే, రాజు నుంచి ఆమెను దూరం చేయాలనే ప్లాన్‌తోనే.. ఆయన భార్య ఈ ప్లాన్ వేసి ఉంటారనే చర్చ జరుగుతోంది.