స్నేహితుడి భార్య పై కన్నేసిన ఆర్మీ అధికారి.. పార్టీ కి పిలిచి భర్తకు మత్తు మందు ఇచ్చి చివరికి.?

praveen
రోజురోజుకీ సభ్య సమాజంలో మానవత్వం ఉన్న మనుషులు కనుమరుగై ఏకంగా కామంతో కళ్లు మూసుకుపోతున్న మనుషులు తక్కువవుతున్నారు అనడానికి నేటి రోజుల్లో వెలుగులోకి వస్తున్న ఘటనలే నిదర్శనంగా మారుతున్నాయి అనే విషయం తెలిసిందే. వావివరుసలు మరచి దారుణంగా వ్యవహరిస్తున్నారు ఎంతో మంది ఇక్కడ ఒక ఆర్మీ అధికారి దారుణానికి పాల్పడ్డాడు. ఎంతో బాధ్యతగా వ్యవహరించాల్సిన ఆర్మీ అధికారి ఏకంగా కామంతో కళ్లు మూసుకుపోయి స్నేహితుడి భార్య పై కన్నేశాడు ఇక చివరికి విదేశీ మహిళ అయిన స్నేహితుడి భార్య పై అత్యాచారానికి పాల్పడ్డాడు ఆర్మీ అధికారి. ఈ దారుణ ఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో వెలుగులోకి వచ్చింది.



 అయితే బాధితురాలి భర్త పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.  వివరాల్లోకి వెళితే..  నీరజ్ లెఫ్టినెంట్ కల్నల్ నుంచి కల్నాల్ గా  ప్రమోషన్ పొందాడు. ఈ సందర్భంగా తన చిన్ననాటి స్నేహితుడునీ విందుకు ఆహ్వానించాడు. నీరజ్ స్నేహితుడు రష్యన్ మహిళ అయిన అతని భార్యను కూడా విందుకు తీసుకొచ్చాడు. ఈ క్రమంలోనే ఇక నీరజ్  అధికారిక నివాసంలో విందు  జరుగుతున్న సమయంలో స్నేహితుడి భార్య పై కన్నేసి  ఏకంగా స్నేహితుడికి ఇచ్చిన మధ్యంలో మత్తుమందు కలిపాడు.


 దీంతో అది తాగిన కొద్ది సేపటికే స్నేహితుడు స్పృహ కోల్పోయాడు.  ఇక అనంతరం అదే అదునుగా భావించిన నీరజ్  బలవంతంగా అతని భార్యని వేరే గదిలోకి తీసుకెళ్లి దారుణంగా అత్యాచారానికి పాల్పడ్డాడు. అతని నుంచి విడిపించడానికి మహిళ తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ ఆమెపై దాడి చేసి అత్యాచారం చేశాడు ఆర్మీ అధికారి.  భర్త స్పృహలోకి వచ్చిన తర్వాత జరిగిన విషయాన్ని భార్య భర్త కు తెలియజేసింది. దీంతో షాక్ అయిన భర్త  వెంటనే కంటోన్మెంట్ పోలీసులకు సమాచారం అందించాడు.  బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు వివిధ సెక్షన్ల కిందకేసు నమోదు చేశారు.  కాగా ప్రస్తుతం నిందితుడు పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: