గ్రేటర్ లో బీజేపీ ని ప్రజలు నమ్మి పెద్ద తప్పు చేశారా..?

P.Nishanth Kumar
బీజేపీ గెలవకపోయినా గెలిచినట్లుగా టీ ఆర్ ఎస్ కన్నా ఎక్కువగా సంబరాలు చేసుకుంటుంది.. గతంలో ఎప్పుడు లేనటువంటి సంతోషం ఆయా పార్టీ ల నేతల్లో ఇప్పుడు కనిపిస్తుంది.. గెలిచినా సంబరం కంటే కేసీఆర్ ని నిలువరించామనే సంతోషం ఇప్పుడు వారిలో ఎక్కువగా కనిపిస్తుంది. అయితే ప్రచారం సమయంలో ఈ రేంజ్ లో ఫలితాలు తమకు అనుకూలంగా వస్తాయని బీజేపీ కూడా ఊహించదు.. ఎందుకంటే దుబ్బాక లో పార్టీ అభ్యర్థి ని చూసి సింపతీ తో ప్రజలు ఓట్లు వేశారు తప్పా తమని చూసి కాదని బీజేపీ కి తెలుసు..
అయినా పిచ్చి పోరాటం తో గ్రేటర్ లో అడుగుపెట్టి కేసీఆర్ పై పైచేయి సాధించారు.. ఈ క్రమంలో బీజేపీ నాయకులూ ప్రజలకు హామీల మీద హామీలు ఇచ్చారు. కేంద్రం నుంచి అది తెప్పిస్తాం, ఇది తెప్పిస్తాం .. వరద బాధితుల సహాయాన్ని 25000 ఇష్టం అంటూ హామీల వర్షం కురిపించారు.. అయితే ప్రజలు కేసీఆర్ పై ఉన్న వ్యతిరేకత కారణంగా బీజేపీ కి ఓటు వేసినా ఇప్పుడు బీజేపీ నేతలు ఆ హామీలను నెరవేరుస్తారా అన్నది ప్రశ్న..  గెలవకున్నా ఎలా హామీలు ఇస్తారు అనిబీజేపీ అంటే గెలవకున్నా ఎలా సంబరాలు చేసుకున్నారు అని ప్రజలు అడిగేందుకు సిద్ధంగా ఉన్నారు.
టీ ఆర్ ఎస్ పార్టీ కి ఇప్పుడు గతంతో పోల్చుకుంటే సీట్లు తక్కువగా వచ్చాయి.. ప్రచారం సమయంలో గులాబీ నేత కూడా వరాలు ప్రకటించారు. అయితే ప్రజలు ఎక్కువగా బీజేపీ నే నమ్మరు.. ఈ నేపథ్యంలో ఇచ్చిన హామీలు అయన అమలు చేస్తారా అన్నది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది.. అయితే ఇప్పుడు ప్రజలు గట్టిగా అడగడానికి కూడా లేదు.. ఎందుకంటే అనుకున్నట్లు గా గెలిచి ఉంటే కేసీఆర్ ఇచ్చిన హామీలు నెరవేర్చి ఉండేవారేమో.. ఇప్పుడు బీజేపీ ని ఎక్కువగానమ్మారు కాబట్టి కేసీఆర్ ఏవిధంగా ఆలోచిస్తారో.. ఏదేమైనా బీజేపీ కి ఎక్కువమంది ఓట్లు వేసి ప్రజలు తప్పు చేశారేమో..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: