ప్రాణం తీసిన కోతులు.. గుంపుగా దాడి చేయడంతో మహిళ మృతి..?
అంతే కాకుండా కొన్ని ప్రాంతాల్లో అయితే ఏకంగా గుంపులు గుంపులుగా వచ్చి మనుషులపై దాడి చేస్తూ గాయపరుస్తున్నాయి కూడా. ఎంతో మంది చిన్నారులు ప్రాణాలు కూడా తీస్తున్నాయి కోతులు. తాజాగా సూర్యాపేటలో ఇలాంటి విషాదకర ఘటన జరిగింది. కోతుల గుంపు దాడిలో మహిళ మరణించిన ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. వివరాల్లోకి వెళితే.. ఈమద్దిరాల మండలం కుక్కడం గ్రామానికి చెందిన శ్రీ లత అనే 25 ఏళ్ల మహిళ కు రెండు నెలల బాబు సహా ముగ్గురు పిల్లలు ఉన్నారు. అయితే ఇంట్లో పని చేసుకుంటున్న సమయంలో ఇటీవల కోతుల గుంపు ఇంటి సమీపంలోకి వచ్చింది.
ఈ క్రమంలోనే కోతులు సదరు మహిళ పై దాడి చేసేందుకు ఒక్కసారిగా గుంపుగా వచ్చాయి భయంతో పరుగులు పెట్టిన శ్రీలత ఈ క్రమంలోనే కాలుజారి గడప పై పడటంతో తలకు గట్టిగా గాయం అయింది దీంతో తీవ్రంగా రక్తస్రావమైంది దీంతో అక్కడికక్కడే మృతి చెందింది శ్రీలత. శ్రీలత మృతితో స్థానికంగా విషాదఛాయలు అలుముకున్నాయి కోతుల బెడద ఎక్కువ ఉండటం కారణంగా ప్రజలందరూ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అధికారులు ఇప్పటికైనా స్పందించి చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.