జగన్ సోషల్ మీడియా వార్నింగ్...?

Gullapally Rajesh
ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ పథకాలను ప్రచారం చేసుకునే విషయంలో వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు కొంతమంది నేతలు ఘోరంగా వెనకబడి ఉన్నారు. అలాగే నియోజకవర్గాల ఇన్చార్జిలు కూడా ఇప్పుడు ప్రజల్లోకి వెళ్లే విధంగా కొన్ని వ్యాఖ్యలు చేయలేకపోతున్నారు. అంతేకాకుండా ఏ రాష్ట్రంలో అమలు కాని సంక్షేమ కార్యక్రమాలు ఆంధ్రప్రదేశ్ లో అమలవుతున్న సరే ఇప్పుడు ప్రచారం చేసుకునే విషయంలో మాత్రం ఘోరంగా విఫలమవుతున్నారు వైసీపీ నేతలు దానితో సీఎం జగన్ కూడా కాస్త ఆగ్రహంగా ఉన్నారని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
సోషల్ మీడియాకు సంబంధించి త్వరలోనే కొన్ని శిక్షణ తరగతులను కూడా సీఎం జగన్ ఏర్పాటు చేసే అవకాశాలు ఉండవచ్చు అని అందరూ భావించారు. అయితే ఇప్పుడు ఆ పార్టీ ఎమ్మెల్యేలకు కొన్ని కీలక సూచనలు చేస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. సోషల్ మీడియాకు సంబంధించి ప్రతి ఒక్క ఎమ్మెల్యే కూడా కొత్త బృందాన్ని ఏర్పాటు చేసుకోవాలని నియోజకవర్గ ఇన్చార్జి కూడా కొత్త టీంను ఏర్పాటు చేసుకోవాలని చెప్పారట. తెలుగుదేశం పార్టీకి సంబంధించి నియోజకవర్గాల్లో ప్రతి ఒక్కటి కూడా ఎండగట్టే విధంగా విమర్శలు చేయాలని ఆయన సూచన చేస్తున్నారు.
సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరు కూడా యాక్టివ్ గా ఉండకపోతే భవిష్యత్తులో కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయని అన్నారట. బిజెపి ఆంధ్రప్రదేశ్ లో బలపడాలని భావిస్తుంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే విధంగా కొన్ని వ్యాఖ్యలు చేసే అవకాశాలు ఉన్నాయని కాబట్టి అందరూ కూడా అప్రమత్తంగా వ్యవహరించాల్సిన అవసరం అనేది ఉంది అని సీఎం జగన్ అంటున్నారు. సోషల్ మీడియాలో ఎవరైతే వెనుకబడి ఉన్నారో వారందరికీ కూడా ప్రత్యేకంగా శిక్షణ తరగతులను ఇప్పించాలని సీఎం జగన్ ప్రణాళిక సిద్ధం చేసుకున్నట్లుగా సమాచారం. దీనికి సంబంధించి ఆయన త్వరలోనే ఒక నిర్ణయం కూడా తీసుకునే అవకాశాలు కనబడుతున్నాయి. ఒక సోషల్ మీడియాలో ఉన్న కీలక నేతలు అందరూ కూడా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకుని వెళ్లాలని ఆయన సూచిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: