పీఏ తో రాసలీలు చేసిన బాస్.. పెళ్లికి అడ్డురావడంతో చివరికి..

Satvika
అక్రమ సంబంధాలు అనేవి ఈరోజుల్లో కామన్ అయిపోయాయి.. ముఖ్యంగా యువతను ఎక్కువగా ఈ వివాహేతర సంబంధాలు ఆకర్షిస్తున్నాయి. దాంతో అనేక దారుణాలు కూడా వెలుగు చూస్తున్నాయి.. అక్రమ సంబంధాల వల్ల చాలా మంది ప్రాణాలను కోల్పోతున్నారు..కొందరు దారుణాలకు పాల్పడుతున్నారు..ఇలాంటి వాటి వల్ల జనాలు ఇబ్బందులు పడుతున్నారు ఇలా చేస్తే కఠిన చర్యలు తప్పవు అని పోలీసులు ఎంతగా చెప్పిన కూడా ప్రబుద్ధులు వినరు..అలా ప్రాణాలు పోయిన తర్వాత లబో దిబో అంటారు..



తాజాగా అక్రమ సంబంధం వల్ల ఓ ప్రాణాలను కోల్పోయాడు..కంపెనీలో పనిచేసే పీఏ తో బాస్ అక్రమ సంబంధాన్ని పెట్టుకున్నాడు.. తీరా ఆమెకి పెళ్లి సంబంధం కుదిరిందని తెలియడంతో తట్టుకోలేక పోయాడు. ప్రియురాలు దూరమైపోతుందన్న కోపంతో ఆమె తల్లి, కాబోయే భర్తతో గొడవపడ్డాడు. చివరికి ప్రాణాలు కోల్పోయాడు. నాలుగు రోజులుగా తన భర్త కనిపించడం లేదంటూ యజమాని భార్య పోలీసులకు ఫిర్యాదు చేయడంతో దారుణం వెలుగుచూసింది.ఈ దారుణ ఘటన ఢిల్లీలో వెలుగులోకి వచ్చింది..



వివరాల్లోకి వెళితే..ఆదర్శ్‌ నగర్‌కి చెందిన నీరజ్ గుప్తా కంపెనీలో ఫైజల్ పనిచేస్తోంది. ఇద్దరి మధ్య ఏర్పడిన సాన్నిహిత్యం వివాహేతర సంబంధానికి దారితీసింది. ఇద్దరూ కొన్నేళ్లుగా రాసలీలలు సాగిస్తున్నారు. తీరా సడెన్‌గా తన ప్రియురాలికి పెళ్లి నిశ్చయమైందని నీరజ్‌కి తెలియడంతో ఆగ్రహం చెందాడు.. వెంటనే తన తల్లి, కాబోయే భర్తతో గొడవ పెట్టుకున్నాడు.ఇద్దరి మధ్య వాగ్వాదం తారాస్థాయికి చేరింది. దీంతో అతను కత్తితో పొడిచి, తలపై బలంగా కొట్టి చంపేశాడు..నీరజ్ శవాన్ని ఓ సూట్‌కేసులో సర్దేశారు. రైల్వే ప్యాంట్రీలో పనిచేసే జుబేర్ ఆ సూట్‌కేసును ఢిల్లీ నుంచి తీసుకెళ్లి గుజరాత్‌‌లోని భరూచ్‌లో పడేశాడు.



నీరజ్ కనపడకుండా పోవడంతో అతని స్నేహితుడు పోలీసులను ఆశ్రయించాడు.కొద్దిరోజుల అనంతరం తన భర్తకు ఫైజల్‌తో వివాహేతర సంబంధం ఉందని.. ఆమెపై అనుమానం ఉందంటూ నీరజ్ భార్య ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఆ దిశగా విచారణ చేపట్టారు. ఆమెను అదుపులోకి తీసుకుని తమ స్టైల్లో విచారించడంతో దారుణం వెలుగుచూసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు..


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: