బ్రతికుండగానే శ్రద్ధాంజలి.. కానీ చివరి లో ఊహించని ట్విస్ట్..?
ఇది ఎక్కడైనా సర్వసాధారణంగా జరుగుతూ ఉంటుంది. ప్రముఖులు మరణించినప్పుడు లేదా తమ కుటుంబీకులు మరణించినప్పుడు... వారి వర్ధంతి రోజున శ్రద్ధాంజలి ఘటించడం లాంటివి చేస్తూ ఉంటారు. ఇక్కడ ఇలాగే శ్రద్ధాంజలి ఘటించారు. కానీ ఇది కాస్త ప్రస్తుతం చర్చనీయాంశంగా మారిపోయింది అయితే ఇక్కడ శ్రద్ధాంజలి ఘటించింది చనిపోయినవారికి కాదు బ్రతికుండగానే ఎంతోమందికి శ్రద్ధాంజలి ఘటించారు. అది కూడా సామాన్య వ్యక్తులకు కాదు ప్రపంచంలోనే ఎంతో గుర్తింపు పొందిన వ్యక్తులు బతికుండగానే శ్రద్ధాంజలి ఘటించారు ఇక్కడ కొంతమంది వ్యక్తులు. ప్రస్తుతం ఇది కాస్తా చర్చనీయాంశంగా మారి పోవడం తోపాటు విమర్శలకు తావిస్తోంది.
ఫ్రాన్స్ లోని ఆర్ ఎఫ్ ఐ రేడియో సంస్థకు చెందిన మీడియా వెబ్సైట్ ఏకంగా 100 మంది కి శ్రద్ధాంజలి ఘటిస్తూ ఒక యాడ్ ఇచ్చింది. ఇది చూసి అందరూ ఒక్కసారిగా షాకయ్యారు. ఎందుకంటే అందులో చనిపోయిన వారితో పాటు ఎంతో మంది బతికున్న ప్రముఖుల పేర్లు కూడా ఉండటం గమనార్హం. ఇక సదరు మీడియా సంస్థ శ్రద్ధాంజలి ఘటించిన జాబితాలో బ్రిటన్ క్వీన్ ఎలిజబెత్, యూఎస్ మాజీ అధ్యక్షుడు జిమ్మీ కార్టూర్ , క్యూబా కమ్యూనిస్టు పార్టీ అధినేత కాస్ట్రో ఇలాంటి ఎంతో మంది ప్రముఖులు ఉన్నారు. ఇది చూసిన అభిమానులు అందరూ ఒక్కసారి ఆగ్రహం వ్యక్తం చేయడంతో వెంటనే స్పందించిన సోషల్ మీడియా సంస్థ సాంకేతిక పొరపాటు వల్ల ఇలా జరిగింది అంటూ క్షమాపణలు చెప్పింది.