విశాఖ నేతల మెడలు వంచుతున్న జగన్..?

P.Nishanth Kumar
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీ పరిస్థితి ఎంత ఘోరంగా ఉందొ టీడీపీ నేతల పరిస్థితి అంతే ఘోరంగా ఉంది. తెల్లవారితే ఎప్పుడు ఏవమవుతుందో తెలీక తెగ భయపడిపోతున్నారు. రాష్ట్రంలోని అందరు టీడీపీ నేతలు, వైసీపీ నేతలు ఎంతో హాయిగా ఉంటున్నారు కానీ విశాఖ లోని టీడీపీ నేతలు మాత్రం ఈరోజు ఎలాంటి పరిస్థితి ఎదురవుతుందో తెలీక దినదినగండంగా గడుపుతున్నారు.. వైసీపీ అధికారంలోకి రావడం పై వారికి ఏమాత్రం అభిప్రాయ తేడాలు లేవు.. ఎందుకంటే ఒకరోజు ఒక పార్టీ లొ ఉంటుంది, ఇంకో రోజు ఇంకో పార్టీ అధికారంలో ఉంటుంది.. అయితే వీరి పరిస్థితి ఎలా ఉందంటే కరవమంటే కప్పకు కోపం, విడవమంటే పాముకు కోపం అన్నట్లు ఉంది.. అమరావతి నుంచి రాజధాని ని విశాఖ కు మార్చిన సంగతి తెలిసిందే..
అయితే చంద్రబాబు అలా తరలించవద్దని అమరావతి లొ ఉండాలని పోరాటం చేస్తున్నారు.. అయితే విశాఖ ప్రజలు చంద్రబాబు చేస్తున్న ఆ పోరాటాన్ని చూసి ఓటు వేసిన విశాఖ లీడర్లను తప్పుబడుతున్నారు.. చంద్రబాబు కు విశాఖ లొ రాజధాని ని ఉంచేందుకు ఏం అడ్డం వస్తుందని ప్రజలు ఆ నేతలను నిలదీస్తున్నారట.. మొదటినుంచి విశాఖ పట్నం టీడీపీ కి అనుకూలంగానే ఉంది. అయినా ఇక్కడిప్రజలకు వ్యతిరేకంగా చంద్రబాబు ఎందుకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారు అని ప్రశ్నిస్తున్నారట.. దాంతో ప్రజలకు అన్యాయం చేసి అమరావతి పై పోరాటం చేద్దామా అంటే మళ్ళీ రాజకీయ భవిష్యత్ అనేది ఇక్కడి ప్రజలు లేకుండా చేస్తారు.. పోనీ టీడీపీ ని వీడి వెళదామా అంటే తీవ్రమైన విమర్శలు చేసిన నోళ్లు పొగుడుతూ వేరే పార్టీ లోకి ఎలా వెళ్లాలా అని ఆలోచిస్తున్నారు..
అయితే రాజధాని విషయంలో ప్రజలు తమను ప్రశ్నించడం ఇప్పుడు తగ్గిపోయినా అధికార పార్టీ తెచ్చే ఇబ్బందులు వారికి తలనొప్పులుగా మారాయట.జీవీఎంసీ అధికారుల యాక్షన్ తో ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియక సతమతం అవుతున్నారు. ఇప్పటికే సబ్బం హరి ఆక్రమణలను తొలగించడంతో ఈ పర్వానికి ప్రారంభం జరిగింది. ఆ తర్వాత ఆయన మౌనం పాటించాల్సి వచ్చింది. అనంతరం గీతం యూనివర్సిటీ వ్యవహారంలో తాత్కాలికంగా స్టే వచ్చినా అనేక అనుమతుల విషయంలో వైఎస్సార్సీపీ నేతలు చేస్తున్న ఫిర్యాదులు ఆ సంస్థ యాజమాన్యాన్ని ఇబ్బందుల్లోకి నెడుతున్నాయి. తాజాగా గంటా శ్రీనివాసరావు ఆక్రమణలు తొలగించినా ఆయన పెదవి కూడా విప్పలేదు. ఆయన ఓవైపు తన ఆస్తులను ఈ వేలం వేయడానికి బ్యాంకింగ్ అధికారులు సిద్దమవుతున్న తరుణంలో తలలు పట్టుకుంటే తాజాగా ఆక్రమణల వ్యవహారం మెడమీదకు వచ్చిపడింది. ఈ నేపథ్యంలో తదుపరి ఎవరు, ఎక్కడా అన్నదే ఇప్పుడు టెన్షన్ గా మారింది. తొలుత సీతమ్మధార నుంచి మొదలుపెట్టి, రిషికొండ మీదుగా ప్రస్తుతం సిరిపురం జంక్షన్ వరకూ చేరిన ఈ వ్యవహారంలో తదుపరి టార్గెట్ ఎవరన్నది ఉత్కంఠగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: